Movies' పుష్ప‌ 2 ' క్రేజ్‌.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా త‌గ్గేదేలే.. !

‘ పుష్ప‌ 2 ‘ క్రేజ్‌.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా త‌గ్గేదేలే.. !

ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 సినిమా బ‌జ్ కొనసాగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా తన జోరు చూపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ అలా విడుదల అయ్యాయో లేదో.. కొన్ని గంటల ముందే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా.. పుష్ప 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది. కెరీర్‌లో ఈ ఘనత సాధించడం బ‌న్నీకి ఇదే ఫస్ట్ టైం. కీలకమైన అమెరికా మార్కెట్‌లో పుష్ప 2 హవా.. ఒక రేంజ్ లో కొనసాగుతోంది.Pushpa 2 The Rule's The Couple Song: Allu Arjun, Rashmika Mandanna groove  to upbeat track with director Sukumar | Telugu News - The Indian Expressఅమెరికాలో ఈ సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షో లతో కలిపి 2.7 మిలియన్ డాలర్ వసూలు సాధించింది. ఈ నెంబర్ ఇంకా పెరుగుతోంది. నిజానికి ఫ్రీ సేల్స్ నెంబర్లు ఇంకా ఎక్కువ ఊహించారు నిర్మాతలు. కానీ.. ఆఖరి నిమిషంలో అన్ని అనుకున్నట్టు జరగలేదు. మరీ ముఖ్యంగా నైజాంలో మల్టీప్లెక్స్‌ల‌లో ప్రీమియర్ షోలపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి సింగల్ స్క్రీన్ కి పరిమితమయ్యాయి. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలు ఈరోజు రాత్రి 9.30 నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో.. ఈ సినిమాకు కావలసిన థియేటర్లు కేటాయించడం.. టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో.. మిడ్ నైట్ షోలకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో చాలాచోట్ల ఈరోజు రాత్రి 9.30కు ప్రీమియర్లు వేసి.. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటిగంటకు.. తిరిగి రేపు ఉదయం 5 గంటల నుంచి షోలు మొదలుపెట్టేలా ప్లానింగ్ నడుస్తోంది. మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. టికెట్ రేట్లు భారీగా పెంచిన ప్రేక్షకులు తగ్గలేదు. ఏపీ, తెలంగాణలో ఈరోజు రాత్రి ప్రీమియర్ షో టికెట్లు హాట్‌ కేకులా అమ్ముడుపోయాయి. రేపు, ఎల్లుండి అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా జోరు చూపిస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇప్పటికే పుష్ప 2 రూ.100 కోట్ల గ్రాస్ దాటేసి రూ.120 కోట్ల వైపు పరుగులు పెడుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news