Moviesఆరు రోజుల్లోనే పుష్పరాజ్‌ ప్రభంజనం .. ఏ సినిమా ఎన్ని రోజుల్లో...

ఆరు రోజుల్లోనే పుష్పరాజ్‌ ప్రభంజనం .. ఏ సినిమా ఎన్ని రోజుల్లో 1000 కోట్లు రాబట్టాయంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి రుజువు చేస్తుంది .. రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలోనే అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇప్పటివరకు ఈ రికార్డు కేవలం ప్రభాస్ నటించిన బాహుబలి 2 సినిమా పైనే ఉండేది .. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి 2 సినిమా విడుదలైన పది రోజుల్లోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఆ తర్వాత మరోసారి రాజమౌళి తెర్కక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా రెండో స్థానంలో నిలిచింది ..Here's Why Pushpa 2 May Find It Hard To Beat Baahubali 2 Box Office Despite  Huge Buzzభారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కేవలం 16రాజుల్లోనే 1000 కోట్ల కలెక్షను రాబట్టింది .. సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలగా నటించారు. ఇక పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన మరో సినిమా కేజిఎఫ్ 2 .. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో కన్నడ హీరో య‌ష్ నటించిన ఈ సినిమా భారీ కలెక్షన్ను రాబట్టింది .. విడుదలైన 16 రోజుల్లోనే ఈ సినిమా కూడా 1000 కోట్ల కలెక్షన్లు దాటింది. ఆ తర్వాత స్థానంలో మరోసారి ప్రభాస్ నటించిన కల్కి 2898ఏడి సినిమా నిలిచింది .. దర్శకుడు నాగ్ అశ్విన్ తెర్కకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయిన 16 రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టింది . ఆ తర్వాత రెండు రికార్డులను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన పేరు మీద రాసుకున్నాడు ..Watch Baahubali 2 - The Conclusion Hindi Movie Online in Full HD on Sony LIVషారుక్ నటించిన జవాన్ బ్లాక్ బస్టర్ హీట్ అయిన విషయం తెలిసిందే .. ఈ సినిమా రిలీజ్ అయిన 18 రోజుల్లోనే 1000 కోట్లు రాబట్టింది .. అంతకు ముందు షారుక్ నటించిన పఠాన్ సినిమా సైతం 1000 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే .. ఈ సినిమా కూడా రిలీజ్ అయిన 27 రోజుల్లో 1000 కోట్ల కలెక్షను రాబట్టింది. ఇలా ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే పుష్ప2 తక్కువ రోజుల్లో 1000 కోట్లు కలెక్షన్ రాబెట్టిన సినిమాగా రికార్డు ఎక్కింది .

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news