టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 థియేటర్లలోకి వచ్చింది. పుష్ప 2 రన్ టైం రన్ టైం 3 గంటల 20 నిమిషాలు. ఆ మాటకు వస్తే సుకుమార్ సినిమాలు అన్నీ లెన్దీగా ఉంటాయి. ఇక పుష్ప 2 సినిమా రన్ టైం 200 నిమిషాలు. ఈ సినిమాని ట్రిమ్ చేయమని నిర్మాతలు అడిగినా, సుకుమార్ ఒప్పుకోలేదట. సినిమా మూడున్నర గంటలు ఉన్నా కూడా రెండున్నర గంటలు అన్నట్టుగానే ఉంది. అయితే ఈ సినిమా వాస్తవ రన్ టైం 4 గంటలు వచ్చిందట. అందులో ఓ 40 నిమిషాలు ట్రిమ్ చేశారట.
అసలు నిర్మాతలు 200 నిమిషాలు ఉండేందుకు కూడా ఇష్టపడలేదట. సినిమాను 170 నిమిషాల వరకు ట్రిమ్ చేయాలని కోరినా సుకుమార్ ఒప్పుకోలేదట. చివరకు 200 నిమిషాల రన్ టైంతోనే సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఫైనల్ రష్ 4 గంటల వరకూ వచ్చిందని టాక్. అందులో 40 నిమిషాల్ని ఎడిటింగ్ టేబుల్ దగ్గర కట్ చేశాడట సుకుమార్. అందులోనూ.. చాలా మంచి సీన్లే ఉన్నాయంటున్నారు. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో కేశవ పాత్ర పరిధి చాలా తగ్గడానికి కారణం.. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కేశవ సీన్లు కట్ చేయడమే అంటున్నారు.ఇక ఎడిట్ చేసిన ఆ 40 నిమిషాల ఫుటేజీని పార్ట్ 3లో వాడుకొనే అవకాశం ఉండడంతో వాటిని పక్కన పెట్టారంటున్నారు. సినిమా విడుదలై హిట్టు కొట్టింది. ఇప్పుడు కొన్ని సీన్లు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటికే 3 గంటల 20 నిమిషాలు ఉంది. ఇంకా సీన్లు యాడ్ చేసే సీన్ లేదు. ఏదేమైనా ఇక్కడ మిగిలిన 40 నిమిషాల సీన్లను చూడాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఎందుకంటే పుష్ప 3 వచ్చినా మరో ఐదేళ్లు పడుతుంది.