టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ.. గత రాత్రి సెకండ్ షో నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై మైత్రి మూవీ మేకర్స్ వారు ముందు నుంచి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అందుకే.. ఏకంగా ముందు రోజు సెకండ్ షో నుంచి భారీ ఎత్తున ప్రీమియర్లు ప్లాన్ చేశారు. అటు.. తెలంగాణ, హైదరాబాద్ తో పాటు.. ఇటు ఆంధ్రాలోను పలు పట్టణాల నుంచి పల్లెటూర్లు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ.. బీసీ సెంటర్లలో ఉన్న థియేటర్లలో కూడా ప్రీమియర్ షోలు వేశారు. విచిత్రం ఏంటంటే టికెట్ రేట్లు భారీగా ఉన్నా కూడా.. అభిమానులు థియేటర్ల దగ్గర పోటెత్తారు.
ఏది ఏమైనా బన్నీపై ఉన్న వీరాభిమానంతో పాటు.. పుష్ప 2 సినిమాపై ఉన్న క్రేజ్‌కు ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్లో అభిమానుల సమక్షంలో సినిమా వీక్షించారు బన్నీ. స్వయంగా అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు థియేటర్‌కు రావడంతో.. అభిమానులు పోటెత్తారు. చివరకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దిల్‌షుక్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో పాటు.. భర్తను తీసుకుని సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చారు.
పోలీసులు లాఠీచార్జి చేయడంతో.. రేవతి కింద పడిపోవడం, అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందారు. ఇక రేవతి కుమారుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏది ఏమైనా తొలి రోజు సినిమా చూడాలన్న ఆత్రుత.. ఎంతో భవిష్యత్తు ఉన్న గృహిణి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వారం రోజులు ఆగిన తర్వాత సినిమా చూడొచ్చు కదా.. ఎందుకు అంత వీరాభిమానం.. ప్రాణాలు పోయేంత రిస్కు చేసి సినిమా చూడటం అవసరమా అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా రేవతి మాత్రమే కాదు.. చాలామంది అభిమానులు దీనిని ఒక గుణపాఠంగా భావించాల్సిన అవసరం ఉంది. తొలి రోజు సినిమా చూడటం కోసం.. సినిమా హీరోలను చూడటం కోసం.. వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎంత మాత్రం భావ్యం కాదు.