టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఫహద్ ఫాజిల్ విలన్‌గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ భారీ పాన్ ఇండియా పుష్ప 2 – ది రూల్. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సీక్వెల్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు రు. 1000 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.సినిమాపై ఉన్న భారీ హైప్ కి తగ్గట్టుగా భారీ బుకింగ్స్ ఈ సినిమాకు కనిపిస్తున్నాయి. నార్త్ లో పుష్ప మేనియా మాములుగా ఉండదు అని ఆల్రెడీ టాక్ ఉంది. ఇందుకు తగ్గట్టు గానే పుష్ప 2 కి భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ ఇండియాలో మొదలైపోయాయి. హిందీలో ఏకంగా పుష్ప 2 కి 26 గంటల్లోనే లక్షకి పైగా టికెట్లు అమ్ముడైనట్టు టాక్ ?
ఇక ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమాకు ఇప్పటికే ప్రీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా రు. 60 కోట్ల వసూళ్లు వచ్చినట్టు టాక్ ? ఇది ఆరంభం మాత్రమే కాగా రిలీజ్ రోజు నాటికి మాత్రం ఇది ఇంకో లెవెల్లో ఉంటుంది అని చెప్పొచ్చు.