టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మరో రెండు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. పుష్ప 2 ప్రి రిలీజ్ బిజినెస్ రు . 1000 కోట్ల రేంజ్‌లో జరిగింది. ఈ స్థాయిలో భారీ అంచనాలు ఉన్న సినిమాకు హీరోగా నటించిన అల్లు అర్జున్ కు ఎంత ? రెమ్యూనరేషన్ ఇచ్చారు అన్న దానిపై ట్రేడ్ వర్గాలతో పాటు టాలీవుడ్ వర్గాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బన్నీ రెమ్యునరేషన్ బయటకు వచ్చింది. సినిమా కు జరిగిన బిజినెస్ మీద 27 % బన్నీకి రెమ్యునరేషన్‌గా ముందు ఫిక్స్ చేశారట. అంటే ఈ లెక్కన సినమాకు జరిగిన రు. 1000 కోట్ల బిజినెస్‌లో బన్నీకి రు. 270 కోట్లు ఇవ్వాలి. అయితే బిజినెస్ తర్వాత లెక్కలు మారాయంటున్నాయి. ఈ లెక్కల తర్వాత దానిని రెమ్యునరేషన్ 27 % నుంచి 24 % కు తగ్గించారని టాక్? కొత్త లెక్క ప్రకారం బన్నీకి రు. 240 కోట్లు ఇచ్చారట. అంటే బన్నీకి ముందు అనుకున్న లెక్కతో పోలిస్తే రు. 30 కోట్లు తగ్గింది. బిజినెస్ అనుకున్న ట్టుగా జరిగినా కూడా బన్నీ రెమ్యునరేషన్ లో మైత్రీ వాళ్ల కాస్త కోత పెట్టారు. ఈ రెమ్యునరేషన్‌తో బన్నీ ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా రికార్డుల్లోకి ఎక్కారు.