Moviesఆన్లైన్ టికెట్ల వార్ .. బుక్ మై షో కి పోటీగా...

ఆన్లైన్ టికెట్ల వార్ .. బుక్ మై షో కి పోటీగా ‘డిస్ట్రిక్ట్’.. పుష్ప గాడు గట్టి దెబ్బ కొట్టాడుగా..!

సినిమాలకు సంబంధించి థియేటర్లు ఓటీటీల మధ్య పోటీ ఉండటం చూశాం.. కానీ తాజాగా ఇప్పుడు ఈ లిస్టులోకి ఆన్లైన్ టికెట్ల బుకింగ్ యాప్లు కూడా చేరుతున్నాయి .. ఇప్పటివరకు ప్రధానంగా ఉన్న టికెట్లు యాప్లు రెండు.. ఒకటి బుక్ మై షో మరొకటి పేటీఎం .. నైజాం కు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళు ఎక్కువగా బుక్ మై షో మీదే ఆధారపడతారు .. ఎప్పటికప్పుడు గంటకు రోజుకు ఎన్ని టికెట్లు బుక్ అవుతున్నాయని సమాచారం ఇస్తుండడంతో ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ పండితులు సైతం దీన్నే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు. ఇక పేటీఎం వాడకం జిల్లా కేంద్రాలు , బీసీ సెంటర్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది .. ఇప్పుడు వీళ్ళ మధ్యలోకి కొత్త ఆటగాడు వచ్చాడు.

హైదరాబాద్‌లో 'పుష్ప 2' ఈవెంట్‌.. చివరి నిమిషంలో ప్లాన్‌ ఛేంజ్‌! | Pushpa 2:  The Rule Pre-Release Event In Hyderabad: Date, Venue Details | Sakshi

పుష్ప 2 అధికారికంగా టిక్కెట్ బుకింగ్ పార్ట్నర్ గా కొత్తగా అవతరించిన ‘డిస్ట్రిక్ట్’ కి మంచి పబ్లిసిటీ వస్తుంది .. అలా అని ఇదేమి కొత్త కంపెనీ కాదు గతంలో ఉన్న టికెట్ న్యూని నడిపిస్తున్న పేటీఎం కొత్తగా జొమాటో తో కలిసిడిస్ట్రిక్ట్ యాప్ ని మొదలుపెట్టింది. ఉత్తినే లాంచ్ చేస్తే జనాలకు దగ్గరవుదు కాబట్టి పుష్ప2తో కొలబరేట్ కావటం వల్ల కోట్ల రూపాయల ప్రమోషన్ జరుగుతుంది. పేటీఎంలో వందలాది సర్వీస్ లు ఉంటే … ఇందులో మాత్రం కేవలం సినిమా ఈవెంట్ల టికెట్లు అమ్మకాలు మాత్రమే ఉంటాయి .. ఒక రకంగా చెప్పాలంటే బుక్ మై షో కి సరైన ప్రత్యామ్నాయంగా దీనికి శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.

బుక్ మై షో కి షాక్ Great Andhra

ఇక ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రభావం బుక్ మై షో మీద కచ్చితంగా పడుతుంది .. అన్నిటికన్నా ముందు పుష్ప2 టికెట్లు ఇందులోనే ఉంటాయని ప్రచారం ఇప్పటికే ఊపందుకోవడంతో సిని ప్రియులు ఆలస్యం చేయకుండా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇక కాకపోతే మొత్తం దేశమంతా టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాక అంత ట్రాఫిక్ ని ఈ కొత్తగా పుట్టుకొచ్చిన యాప్ తట్టుకుంటుందో లేదో చూడాలి. బలమైన సర్వర్లు ఉన్నప్పటికీ సలార్ టైంలో బుక్ మై షో గంటల తరబడి క్రాష్ అయ్యింది. మరి పుష్ప సునామిని ముందే ఊహించి డిస్ట్రిక్ట్ ని దానికి తగ్గట్టు సంసిద్ధం చేశారో లేదో షోలు, స్క్రీన్లు పెరిగే కొద్దీ ఇంకో రెండు రోజుల్లో తేలిపోతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news