నందమూరి నరసింహ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెరపై చూసేందుకు అభిమానులు ఏడు ఎనిమిది సంవత్సరాలుగా తహతహ లాడుతున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇప్పటికే ఆలస్యం అయింది. సాధారణంగా హీరోలు కావాలనుకున్న వారసుల పిల్లలు 20 ఏళ్ల వయసులోనే రెడీ అవుతారు .. జూనియర్ ఎన్టీఆర్ అయితే టీనేజ్ దాటక ముందే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మోక్షజ్ఞ ప్రస్తుత వయసు 30 ఏళ్ళు .. ఇప్పటికైనా ఓ పది సినిమాలు చేయాల్సింది కారణం ఏదైనా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ బాగా లేట్ అయింది.ఎట్టకేలకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లింది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యి సైతంసెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటోన్న టైంలో మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ ఓ ప్రచారం నడుస్తోంది. ప్రశాంత్ వర్మ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో పాటు లాభాల్లో వాటా అడుగుతున్నాడని టాక్ వచ్చింది. ప్రశాంత్ వర్మ డిమాండ్లు రోజు రోజుకు ఎక్కువ కావడంతో ఈ కాంబినేషన్ దాదాపు రద్దు అయినట్టే అంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య స్వయంగా తన దర్శకత్వం లోనే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసేయాలన్న నిర్ణయానికి వచ్చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ కెరీర్లో కల్ట్ క్లాసిక్ గా ఉన్న ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ మోక్షజ్ఞతో చేయాలని బాలయ్య ఫిక్స్ అయిపోయాడంటున్నారు. ఈ సీక్వెల్ కు కథ కూడా బాలకృష్ణనే రాసుకున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం బాలకృష్ణ ఆదిత్య 999 మ్యాక్స్ కి ఏర్పాట్లు మొదలుపెట్టాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందంటున్నారు. మరో వైపు డాకూ మహారాజ్ షూటింగ్ పూర్తయ్యింది. దీంతో వెంటనే బాలయ్య .. బోయపాటి దర్శకత్వం లో అఖండ 2 కు డేట్లు ఇవ్వనున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ – వెంకీ అట్లూరి పేరు కూడా మోక్షజ్ఞ అప్ కమింగ్ దర్శకుల లిస్ట్ లో ఉన్నాయి.