నందమూరి వారసుడు నందమూరి మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ – చెరుకూరి సుధాకర్ ప్రాజెక్టుకు సడెన్‌గా బ్రేక్ పడింది. తెల్లవారి పూజ అనగా సడెన్‌గా సినిమా ఆగిపోయింది. దీంతో రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. మోక్షుకు, ప్రశాంత్‌వర్మకు మధ్య ఏదో గ్యాప్ ఉందని.. లేదు అసలు మోక్షుకే ఈ సినిమా చేయడం ఇష్టం లేదని ఇలా చాలా చాలా చాలా స్పెక్యులేషన్లు నడుస్తున్నాయి.
అసలు ఈ ప్రాజెక్టు లేదని.. మధ్యలో నాగ్ అశ్విన్ ప్రాజెక్టు తెరమీదకు వచ్చిందని ప్రచారం జరగడం.. దీనికి కౌంటర్‌గా నాగ్ అశ్విన్‌తో సినిమా ఫేక్ న్యూస్ అంటూ వార్తలు వచ్చాయి. ఈ లోగా నిర్మాత చెరుకూరి సుధాకర్ టీం వైపు నుంచి ఏమైనా ఉంటే తామే చెపుతామంటూ ప్రకటన. ప్రశాంత్ వర్మకు జై హనుమాన్ కూడా ఉంది. దీంతో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి.మోక్షు – ప్రశాంత్ వర్మ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయంటున్నారు. ప్రశాంత్ వర్మకు ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన హీరో ఎవ్వరూ లేరు. ప్రభాస్ సినిమా ఉన్నా.. ప్రభాస్ ఇప్పట్లో ఖాళీ కాడు. ఏది ఏమైనా సినిమా త్వరగా పట్టాలు ఎక్కితే ఈ పుకార్లకు చెక్ పడినట్లు అవుతుంది.