ప్రస్తుతం తెలుగు మీడియా .. అటు జాతీయ మీడియా అందరికి ఫోకస్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద ఉంది. ఓవైపు బన్నీ నటించిన పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తోంది. పుష్ప 2 సినిమా రిలీజ్ కు ముందు రోజు వేసిన ప్రీమియర్ షో లో సంధ్యా ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసిలాటలో ఒక మహిళ మృతి చెందిన కేసులో అరెస్టు అయ్యి ఒక రోజు రాత్రి అంతా జైల్లో ఉండి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే .. ఇక్కడ వరకు బాగానే ఉంది. బన్నీ ఇటీవల ఓపెన్ గా చేస్తున్న పనులు కావాలని చేస్తున్నాడా ? అనుకోకుండా కాకతాళీయంగా జరుగుతున్నాయా ? అన్నది కాసేపు పక్కన పెడదాం. అయితే కొన్ని విషయాలు మరీ కామెడీగా ఉన్నాయన్న చర్చలు కూడా అందరి నోటా వినిపిస్తున్నాయి. ఎన్నో డైలాగులు చిరంజీవిని ఎత్తి చూపుతున్నట్టు ఉన్నాయి అన్న విమర్శలు వచ్చాయి. దీనిపై బన్నీ కనీసం సోషల్ మీడియా వేదికగా ఒక కౌంటర్ ఇస్తే సరిపోయేది .. నిర్మాతలు ఖండించారు .. కానీ అల్లు అర్జున్ మాత్రం అస్సలు ఖండించలేదు.
అల్లు అర్జున్ తన మామయ్య చిరంజీవిని కలిసినప్పుడు ఆయన కనీసం సాలువా కప్పి ఆశీర్వదించారా ? ఎలా ఆశీర్వదిస్తారు ఆ డైలాగులు గురించి క్లారిటీ లేకుండా .. అసలు మెగా హీరో అయిన రామ్ చరణ్ కూడా సీన్లోకి రాలేదు. జైలు నుంచి ఇంటికి వచ్చాక లైవ్ టెలికాస్ట్ పెట్టడం .. ఆ సమయంలో ఐకాన్ స్టార్ అనే టి షర్టు వేసుకోవడం మరీ కామెడీగా ఉంది. అస్సలు హుందాగా లేదన్న కామెంట్లు కూడా బన్నీపై పడుతున్నాయి. ఓ పక్క తల్లి చనిపోయి .. చావు బతుకుల్లో శ్రీ తేజ అనే పిల్లవాడు ఉంటే ఈ వేడుకలు ఏంటి ఈ పరామర్శలు ఏంటని ? జాతీయ మీడియా ఒక్కసారిగా ఫైర్ అయింది.ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పటివరకు కూడా అల్లు అర్జున్ కానీ .. అల్లు అర్జున్ కుటుంబం కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేదు. లీగల్ గా వెళ్లి కలవాల్సిన అవసరం లేదు … మోరల్ గా అయితే కచ్చితంగా కలవాలి కదా .. దానికి లీగల్ కారణాలు ఉన్నాయి .. బాధిత కుటుంబాన్ని కలవడానికి లేదని తర్వాత కచ్చితంగా కలుస్తానని .. సాయం అందిస్తూనే ఉంటానని ఒక పోస్ట్ అయితే పెట్టాడు. మరి మోహన్ బాబు తాను కొట్టిన టీవీ9 విలేకరిని ఎలా కలిశాడు ? అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఏదేమైనా బన్నీ ఎదుగుతున్నాడు అందరికి ఆనందమే అంతకుమించిన హుందాతనం అతడికి ఉండాలి.