Moviesఇండ‌స్ట్రీపైనే బ‌ల ప్ర‌ద‌ర్శ‌నా బ‌న్నీ... రేవంత్ అంటే అంత అలుసా..?

ఇండ‌స్ట్రీపైనే బ‌ల ప్ర‌ద‌ర్శ‌నా బ‌న్నీ… రేవంత్ అంటే అంత అలుసా..?

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందటం .. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ ఉండటం తెలిసిందే. దీనిపై కేసు నమోదు కావటం హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం .. చక చక బెయిలు రావడం అయినా తర్వాత పరిణామాల నేపథ్యంలో ఒకరోజు రాత్రి బన్నీ జైలులో ఉండి మరుసటి రోజు ఉదయం రిలీజ్ కావటం జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన దుర్ఘటనలో తప్పు ఎవరిది అన్నది రెండు వైపులా ఆలోచించాలి. బందోబస్తు ఇవ్వడం పోలీసుల బాధ్యత .. అసలే హైదరాబాద్ మహానగరం ట్రాఫిక్ తో అతలాకుతలమవుతుంది. పోలీసుల సంఖ్య సరిపోవటం లేదు. తాము పర్మిషన్ కోరామని సంధ్య థియేటర్ యాజ‌మాన్యం చెబుతోంది.

Lok Sabha polls: Telangana CM Revanth Reddy to embark on tour of districts  after Jan 26

అయితే సెలబ్రిటీలను తీసుకురావద్దని తాను చెప్పామని పోలీసులు చెబుతున్నారు. ఓ హీరో బహిరంగ సభకు వచ్చినట్టు అది కూడా అర్ధరాత్రి వేళ ఓపెన్ టాప్ వాహనంలో చేతులు ఊపుతూ వస్తే ఫ్యాన్స్ ఎలా రెచ్చిపోతారో చెప్పక్కర్లేదు. సరే బన్నీ జైలు నుంచి బయటికి వచ్చాడు. అక్కడితో ఆగితే బాగుండేది.. కానీ అక్కడి నుంచి అది ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టుగా బల ప్రదర్శన దిశగా సాగుతోంది. అల్లు అర్జున్‌ను ఇండస్ట్రీలో చిన్న చిన్న నటుల నుంచి పెద్ద పెద్ద నటులు నిర్మాతలు.. దర్శకుల వరకు మూడు రోజులపాటు పరామర్శించారు. అయితే ఒక్క హీరోయిన్ కానీ మహిళా నటి కానీ వెళ్ళలేదు. పైగా లైవ్ స్ట్రీమింగ్ పెట్టి చేసిన హడావుడి అంతా అంతా కాదు.. మీడియా కూడా బాగా హడావుడి చేసింది.

కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు భ‌యంతోనో… భ‌క్తితోనో టాలీవుడ్ అంతా అణిగిమ‌ణిగి ఉంది. అస‌లు కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభించిన రోజు టాలీవుడ్ హీరోలు అంద‌రూ బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ప్ర‌పంచంలోనే గొప్ప ప్రాజెక్టు అన్న‌ట్టుగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అదే రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితే ఒక‌రిద్ద‌రు త‌ప్పా ఎవ్వ‌రూ క‌ల‌వ‌నూ లేదు.. క‌నీసం సోష‌ల్ మీడియాలో పోస్టులు కూడా పెట్ట‌లేదు.

చివ‌ర‌కు బ‌న్నీ అయితే రేవంత్ రెడ్డి పేరు మ‌ర్చిపోయిన‌ట్టుగా మాట్లాడాడు. అస‌లు ఇలా ఓ సెల‌బ్రిటీ సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్య‌మంత్రి గురించి మాట్లాడ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అన్న‌ది కూడా ఆలోచ‌న చేసుకోవాలి. ఇక బ‌న్నీ తో పాటు ఇండ‌స్ట్రీ జ‌నాలు బ‌న్నీకి స‌పోర్ట్ చేయ‌డం త‌ప్పు కాదు కాని.. ముఖ్య‌మంత్రి అంటే అలుసాగా ఉండ‌డం.. ప్ర‌భుత్వంతో పోటీ అంటూ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం ఎవ్వ‌రికి మంచిది కాదు. ఈ విష‌యంలో అంద‌రూ ఆచితూచి ముందుకు వెళ్లాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news