Moviesఅల్లు అర్జున్ కేసు టాలీవుడ్‌ను ఇంత‌లా న‌ష్ట‌ప‌రుస్తోందా..?

అల్లు అర్జున్ కేసు టాలీవుడ్‌ను ఇంత‌లా న‌ష్ట‌ప‌రుస్తోందా..?

కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బిఆర్ఎస్ – బిజెపి అల్లు అర్జున్‌కు మద్దతుగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు అన్నది నిజమైనా.. అది అల్లు అర్జున్ మీద సానుభూతి కాదు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే వ్యూహం అన్న అభిప్రాయాలు గట్టిగా వినిపించాయి. సరే ఆ రెండు పార్టీలు ఎంత సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ కు ఒరిగేది ఏమీ లేదు.. ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వం మధ్య ఒక రేంజ్ లో ఫైటింగ్ అయితే నడుస్తోంది. అయితే ఈ వివాదంలో ఎవరు ఎలా ఉన్నా ? టాలీవుడ్‌కు నష్టం ఎక్కువగా కనిపిస్తోంది.. మబ్బుల్లో విహరిస్తున్న స్టార్ హీరోలు నేల మీదకు వస్తున్నారు.Pushpa 2: The Rule (2024) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShowఅడ్డగోలు ప్రీమియర్లు .. బెనిఫిట్ షోలకు నో ఛాన్స్ భారీగా అభిమానులు వచ్చే స్టార్ హీరోల ప్రి రిలీజ్ ఫంక్షన్లకు అనుమతులు కష్టమే కావ‌చ్చు. ఇక‌ టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా పెంచుకునేందుకు అవకాశం లేదు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా మొన్నటి పుష్ప 2 రేట్లు పెంపు మరి అడ్డగోలుగా ఉండి చివరకు ఇప్పుడు ఇలా విరిగిపడింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతవరకు మాట మీద నిలబడతారు అన్న సందేహాలు ఉన్నాయి.CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త ..సన్నవడ్లపై  కీలక ప్రకటన | Chief Minister's review in Secretariat on DSC selected  polarization of rice procurementఎందుకంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త చైర్మన్ దిల్ రాజు చక్రం తిప్పుతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఇక్కడే మరో విచిత్రం కూడా ఉంది.. పుష్ప 2 సూపర్ డూపర్ హిట్ అయ్యాక అసలు తెలుగు సినిమాలో స్టార్ హీరోల సినిమాలకు కథ‌ ఎందుకు ? అన్న ప్రశ్న వస్తోంది. కథ‌ ఎలా ఉన్నా హాయ్ అనిపించే ఎలివేషన్లు పాత్రలు అయితే చాలు అన్నట్టుగా ఉంది. ఏది ఏమైనా తెలుగు సినిమా వాళ్లు త‌మ‌ కష్టాలు చేజేతులా పెంచుకుంటున్నారు. దీంతో ఇండ‌స్ట్రీ మరింత పొల్యూట్ కాబోతుంది.

Latest news