టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత 100 కోట్ల కలెక్షన్లు అనేవి చాలా చిన్నవి అయిపోయాయి. పెద్ద సినిమాలు 500 లేదా 1000 కోట్ల టార్గెట్‌తో థియేటర్లలోకి వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ఎక్కుతున్న సినిమాలుకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. కంటెంట్ ప్రేక్షకులకు ఏమాత్రం వచ్చిన అంచనాలను మించి సక్సెస్ అందిస్తున్నారు. అలాగే ఎవరు ఊహించని కలెక్షన్లు కూడా వస్తున్నాయి.ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన కల్కి – పుష్ప 2 సినిమాలు రు. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకున్నాయి. దేవర 1 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హనుమాన్ 300 కోట్ల వసూళ్లు రాబట్టింది. వీటిలో అత్యధికంగా పుష్ప 2 రు. 1700 కోట్ల కలెక్షన్లతో తెలుగు రాష్ట్రాలలో టాప్ ప్లేస్ లో ఉంది. ఇంకా థియేటర్లలో సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఓవరాల్ గా తెలుగులో అత్యధిక వసూలు సాధించిన ఆల్ టైం సినిమాల జాబితా చూసుకుంటే త్రిబుల్ ఆర్ మూవీ మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమా ఏకంగా ఏపీ – తెలంగాణ లోనే ఏకంగా రు. 405. 9 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఏపీ తెలంగాణలో టాప్ గ్రాస్ మూవీస్ :1 ) ఆర్ఆర్ఆర్ – రు . 405.9 కోట్లు
2 ) బాహుబలి 2 – రు . 327.9 కోట్లు
3 ) పుష్ప 2 – ( 3వారాలు ) – రు. 304.5 కోట్లు
4 ) కల్కి 2898 ఏడీ – రు. 275.5 కోట్లు
5 ) దేవర పార్ట్ 1 – రు. 233 కోట్లు