Moviesవ‌రుణ్‌తేజ్ కెరీర్ ఇంత ఒడిదుడుకులా... అస‌లేం జ‌రిగింది...?

వ‌రుణ్‌తేజ్ కెరీర్ ఇంత ఒడిదుడుకులా… అస‌లేం జ‌రిగింది…?

టాలీవుడ్‌లో మెగా బ్రాండ్ ఇమేజ్ క్రేజ్ తెలిసిందే. మెగా వార‌స‌త్వాన్ని కొన‌సాగించ‌డం అంత సుల‌భం కాదు. చాలా అంచ‌నాలు ఉంటాయి. గ‌ట్టి పోటీ ఎదుర్కోవాలి. బ్రాండ్ ఇమేజ్ నిల‌బెట్టాలి. వ‌రుణ్ తేజ్ సినిమా జ‌ర్నీ ముకుంద‌తో స్టార్ట్ అయ్యింది. ఈ రోజుకు ఖ‌చ్చితంగా ప‌దేళ్లు సినిమా ప్ర‌స్థానం పూర్తి చేసుకున్నాడు. ఈ ప‌దేళ్ల‌లో వ‌రుణ్ తేజ్ కెరీర్ ఒడిదుడుకుల‌తోనే న‌డుస్తోంది.

గాంఢీవధారి అర్జున'.. బడ్జెట్ కు సెట్టయ్యే బజ్ లేదు | Varun Tej  Gandeevadhari Arjuna Struggles with Prerelease Buzz

ఒక్క‌సారి వెన‌క్కు వెళితే ముకుంద‌, కంచె, ఫిదా, తొలిప్రేమ‌, ఎఫ్ 2, ఎఫ్ 3, గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ ఇవ‌న్నీ మ‌ర‌పురాని విజ‌యాలే. ఇక హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠితో రెండు సినిమాల్లో న‌టించాడు. రెండు పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. కానీ ఆమెనే ప్రేమించి త‌న జీవిత భాగ‌స్వామిని చేసుకున్నాడు. వ‌రుణ్‌లో మంచి మాస్ అప్పీల్ ఉంది. కానీ స‌రైన క‌థ‌లు ఎంచుకోక కెరీర్‌లో వెన‌క‌ప‌డిపోయాడు.

వ‌రుణ్ యాక్ష‌న్ సినిమాలు చేసిన‌ప్ప‌టి కంటే స్మూత్ క‌థ‌లు చేస్తేనే ప్రేక్ష‌కులు ఆద‌రించారు.
కొన్ని ప్ర‌యోగాలు వ‌రుణ్ ని బాగా దెబ్బ‌కొట్టాయి. అంత‌రిక్షం, ఆప‌రేష‌న్ వాలైంటైన్ ఇలాంటివే. గ‌తేడాది గ‌ని, మ‌ట్కా, గాంఢీవ‌ధారి అర్జున అన్నీ సినిమాలు బోల్తా కొట్టాయి. సినిమా కెరీర్ అనుకున్న స్థాయిలే లేక‌పోయినా వ్య‌క్తిగ‌తంగా ప్ర‌వ‌ర్త‌న చాలా మంచిగా ఉంటుంది. త‌న ఫ్యామిలీని ఎంతో గౌర‌విస్తాడు. మెగా ట్యాగ్‌ను ఎప్పుడూ మ‌ర్చిపోడు.

OTT: థియేటర్‌లో డిజాస్టర్ .. ఓటీటీలోకి దిగిన వరుణ్ తేజ్ మట్కా, ఎందులో అంటే?  | mega hero disaster 40 cr budget 2 cr collection matka ott date is out -  Telugu Filmibeatఅయితే ఇప్పుడు వ‌రుణ్ కి ఓ డీసెంట్ హిట్ అవ‌స‌రం. మ‌రో ప‌దేళ్ల పాటు కెరీర్ భ‌ద్రంగా సాగాలంటే.. రాబోతున్న సినిమాల‌పై, క‌థ‌ల‌పై తాను తీవ్రంగా క‌స‌ర‌త్తు చేయాలి. ప్ర‌స్తుతం కొరియ‌న్ క‌న‌క‌రాజు చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే మ‌నోడి కెరీర్ ట్రాక్ ఎక్కుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news