రామ్ చరణ్ – శంకర్ – దిల్ రాజు కాంబినేషన్ లో తయారైన సినిమా గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. శంకర్ తన సినిమాలను స్క్రీన్ మీద ఎంత విజువల్ వండర్ గా చూపిస్తాడో తెలిసిందే. ఈ సినిమా కోసం డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేశారు. పాటలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కొన్ని సీన్ల కోసం రోజుకు కోట్లు ఖర్చు చేశారు. ఇంతకు ఈ సినిమాకు ఎంత ఖర్చు పెట్టారు ?ఎంత రిటర్న్ వచ్చింది ? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ సినిమాకు అన్ని ఖర్చులు కలిపి రు. 500 కోట్లకు పైగానే అయిందని తెలుస్తోంది. ఈ సినిమాకు మొదట్లో జీటీవీ తో ఒప్పందం ఉండేది. తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయి లెక్కల్లో తేడా వచ్చేసింది. ఈ సినిమాకు రెండు వందల కోట్ల వరకు నాన్ ధియేటర్ నుంచి రికవరీ వచ్చింది. మరో రు. 300 కోట్ల ఆదాయం రావాలి. ఎన్టీఆర్ దేవర లెక్క ప్రకారం చూసిన ఏపీ – తెలంగాణ నుంచి రు. 120 కోట్ల ఆదాయం థియేటర్ నుంచి రావాలి .. లేదా పుష్ప – సలార్ లాంటి లెక్కలు చూస్తే అంతకంటే ఎక్కువ అందువల్ల థియేటర్ నుంచి రావాలిఇందులో సగం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా రావాలి.. సంక్రాంతి సీజన్ కావటం కలిసి రానుంది. ఇక మరో 150 లేదా రు. 180 కోట్లు తెలుగు, తమిళ, కన్నడ, ఓవర్సీస్ నుంచి రావాలి. హిందీ ఎలాగూ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సొంతంగా రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎలాగూ నైజాం – వైజాగ్ ఆయన సంస్థ పంపిణీ చేస్తుంది. మిగిలిన ఏరియాలకు ఆయన రెగ్యులర్ బయర్లు ఉండనే ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే హిందీ వెర్షన్ ఎంత బాగా వసూళ్లు వస్తే అంత మేరకు లాభాలు వస్తాయి. తెలుగు వెర్షన్ ఎంత బాగా ఆడితే అంత రిస్కు తగ్గుతుంది.