Moviesగ్యాంగ్‌లీడ‌ర్ సినిమాకు చిరు కంటే ముంద‌నుకున్న హీరో ఎవ‌రో తెలుసా..!

గ్యాంగ్‌లీడ‌ర్ సినిమాకు చిరు కంటే ముంద‌నుకున్న హీరో ఎవ‌రో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి కేర్ లో గ్యాంగ్ లీడర్ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది ఈ సినిమా కథ ముందు చిరంజీవి కోసం అనుకున్నది కాదు. అలాగే చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన ఆఖరి బ్లాక్ బస్టర్ సినిమా. అంతే కాదు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరి – చిరంజీవి కాంబినేషన్లో బ్యాక్ టు బ్యాక్ మ్యూజికల్ హిట్లు వచ్చిన సంవత్సరం 1991. ఆ సంవత్సరం బ‌ప్పీలహరి – చిరంజీవి కాంబినేషన్లో గ్యాంగ్ లీడర్ – రౌడీ అల్లుడు సినిమాలో వచ్చి రెండు మ్యూజికల్ గా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. గ్యాంగ్ లీడర్ కథ ప‌రుచూరి సోద‌రులు ముందుగా చిరంజీవి కోసం రాయలేదు.గ్యాంగ్ లీడర్‌ కు 30 ఏళ్లు.. ఇది నాగబాబు చేయాల్సింది తెలుసా?ఈ కథ నాగబాబు కోసం అనుకుని ఆయనకు చెప్పారట. పరిచూరి సోదరులు అయితే నాగబాబు కంటే కూడా చిరంజీవి ఈ సినిమా చేస్తే పెద్ద హిట్ అవుతుందని అందరూ అనుకుని .. కథలో కొన్ని మార్పులు చేసి మళ్ళీ చిరంజీవికి చెప్పారట. చిరంజీవి కథ విన్న వెంటనే ఎంతో ఎగ్జైట్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్యాం ప్రసాద్ ఆర్ట్స్‌ బ్యానర్‌పై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు విజయ బాపినీడు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏ స్థాయిలో సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్యాంగ్ లీడర్ సినిమాను ఒకవేళ చిరంజీవితో కాకుండా నాగబాబుతో చేస్తే బాక్సాఫీస్ దగ్గర లెక్కలు అన్ని పూర్తిగా రివర్స్ అయ్యేవి అనటంలో ఎలాంటి సందేహం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news