నందమూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ ఎలాంటి సెన్షేషనల్ హిట్ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తోన్న ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల నుంచి ఓ యాక్షన్ షెడ్యూల్ ను షూట్ చేస్తారని టాక్. ఈ షెడ్యూల్ లో బాలయ్యతో పాటు మిగిలిన టీమ్ కూడా జాయిన్ కానున్నారు. ఈ యాక్షన్ షెడ్యూల్ కోసం బోయపాటి కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ యాక్షన్ బ్లాక్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తోందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై దర్శకుడు బోయపాటి దృష్టి పెట్టారు. ఆల్ రెడీ, ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని నిర్మాతలు.. దర్శకుడు ఫిక్స్ అయ్యారు. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై అంచనాలు డబుల్ అయ్యాయి.