టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్ .. కన్నడలో దివంగత పునీత్ రాజ్ కుమార్ తో కూడా సినిమాలు చేసి భారీ హిట్లు ఇచ్చాడు. ఆయనతో సినిమా చేసిన ప్రతి హీరోకి విపరీతమైన మాస్ ఇమేజ్ వస్తుంది. పూరి జగన్నాథ్ మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ తో చేయటం … బద్రి సినిమా సూపర్ హిట్ అవడంతో కొన్నాళ్లపాటు పూరి జగన్నాథ వరుస హిట్లతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసాడు.ఆ టైంలోనే ఎన్టీఆర్ తో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఆంధ్రవాలా సినిమా కథ రాసుకొని చిరంజీవికి ముందుగా చెప్పాడట. అయితే ఆ కథ చిరంజీవికి ఎంత మాత్రం నచ్చలేదు … ఈ కథను చిన్ని కృష్ణ ద్వారా కవర్లో పెట్టి మరి చిరంజీవికి పంపారట పూరి జగన్నాథ్. కథ ఏ మాత్రం నచ్చని చిరంజీవి ఆ కవర్‌ను ముక్కలు ముక్కలుగా చేసి పడేసారట. ఈ కథ తనకు ఏమాత్రం నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పేసారట.ఆ తర్వాత చిరంజీవి రీఎంట్రీ సమయంలో పూరి జగన్నాథ్ ఆటో జానీ అనే టైటిల్ తో కథ రాసుకుని చిరంజీవి చుట్టూ తిరిగారు. చిరంజీవికి కథ ఎంత మాత్రం నచ్చలేదు.. పూరి విసిగి వదిలేసుకున్నారు. ఆ తర్వాత తమిళ హిట్ సినిమా కత్తికి రీమేక్ గా వినాయక దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 సినిమా చేసి చిరంజీవి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.