Movies" డాకు మ‌హ‌రాజ్ " సెన్సేష‌న్‌.. న‌ట‌సింహం మాస్ తుఫాన్‌.. }

” డాకు మ‌హ‌రాజ్ ” సెన్సేష‌న్‌.. న‌ట‌సింహం మాస్ తుఫాన్‌.. }

గాడ్ ఆఫ్ మోసెస్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా సినిమా డాకు మహారాజ్. బాబి కొల్లి దర్శకత్వంలో ఈ భారీ మాస్ యాక్షన్ సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య వరుసగా మూడు సూపర్ డూపర్ హిట్లు కొట్టిన తర్వాత వస్తున్న డాకు మహారాజ్ సినిమాపై.. నందమూరి అభిమానులతో పాటు.. తెలుగు సినిమా ప్రేమికుల్లో ఎంతో ఆసక్తి ఉంది. ఈ సినిమా షూటింగ్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. డాకు మహారాజ్ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయినట్లు మేకర్స్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సంక్రాంతికి బిగ్ స్క్రీన్ లో మాస్ తుఫాన్ కోసం మేమంతా సిద్ధంగా ఉన్నాము. అల్టిమేట్ మాస్ విస్ఫోటనం కోసం సిద్ధంగా ఉండండి అని మేకర్స్‌ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలోనే డాకు ఇన్ యాక్షన్ అంటూ సరికొత్త పాస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో దర్శకుడు బాబి సెట్స్ లో బాలయ్యకు సన్నివేశాలు వివరిస్తూ కనిపించారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి లాంటి మూడు వ‌రుస‌ సూపర్ డూపర్ హిట్ సినిమాలు.. తర్వాత బాలయ్య చేస్తున్న ఈ సినిమాపై మామూలు అంచనాలు లేవు. చిరంజీవి లాంటి హీరోతో వాల్తేరు వీర‌య్య లాంటి బ్లాక్‌బ‌స్టర్ హిట్ కొట్టి డైరెక్టర్ బాబి మంచి ఫామ్ లో ఉన్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ కూడా కంప్లీట్ కావడంతో.. బాబి ఆలస్యం చేయకుండా బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక ప్రమోషనల్ కంటెంట్ వదులుతూ సినిమా రిలీజ్ వరకు అభిమానుల్లో జోష్ నింపేయలని ప్లాన్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తుండగా.. థ‌మ‌న్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news