నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో వాల్తేరు వీరయ్య ( బాబి) దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న సినిమా డాకూ మహారాజ్. బాలయ్య నటించిన గత మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో పాటు చాలా యేళ్ల తర్వాత హ్యాట్రిక్ హిట్లు పడ్డాయి. దీంతో ఇప్పుడు డాకూ మహారాజ్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోన్న వేళ సినిమా సాలిడ్ రన్ టైం ఫిక్స్ అయ్యింది. మనకు అందుతోన్న సమాచారం ప్రకారం డాకూ మహారాజ్ రన్ టైం 2 గంటల 45 నిమిషాల కట్ తో థియేటర్స్‌లోకి రానుంది.ఇక ఆల్రెడీ ఈ సినిమాను బాబీ నెక్ట్స్ లెవల్లో తెరకెక్కించారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రగ్య జైశ్వాల్ కూడా మరో హీరోయిన్గా నటిస్తోందని సమాచారం. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా… వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.