నందమూరి నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో డాకు మహారాజ్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక బాలయ్య ఈ సినిమాకు సంబంధించి తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసేశారు.ఇక డిసెంబర్ 15 నుంచి నాన్ స్టాప్ అప్‌డేట్లతో ప్రమోషన్లు షురూ చేశారు. ప్రమోషన్లను వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాపై బజ్ మరింత పెంచేలా సాంగ్స్‌తో పాటు రిలీజ్ విషయంలో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలయ్య తన కెరీర్‌లో మూడు వరుస సూపర్ డూపర్ హిట్లతో ఉండడంతో పాటు బాబి కూడా చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి హిట్ సినిమా తర్వాత బాబి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు.ఈ సినిమాలో ప్రగ్య జైశ్వాల్ – శ్రద్ధా శ్రీనాథ్ మరియు ఊర్వశి రౌతేలా కథానాయికలుగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.