Movies' డాకూ మ‌హారాజ్ ' ఫైన‌ల్ ర‌న్ టైం... బాల‌య్య యాక్ష‌న్...

‘ డాకూ మ‌హారాజ్ ‘ ఫైన‌ల్ ర‌న్ టైం… బాల‌య్య యాక్ష‌న్ ఎంత సేపో తెలుసా..!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ మూవీ ‘డాకు మహారాజ్’ . ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు బాబి డైరెక్ట్ చేయ‌గా.. సితార బ్యాన‌ర్‌, ఫార్య్చ‌న్ ఎంట‌ర్టైన్‌మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ టీజ‌ర్‌తో పాటు అన్నీ ప్ర‌మోష‌న‌ల్ క‌ట్స్ అద‌ర‌గొడుతూ సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ చేశాయి.ఇదిలా ఉంటే డాకూ మ‌హారాజ్ ఫైన‌ల్ ర‌న్ టైం క‌ట్ అయిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమా ర‌న్ టైం 2 గంటల 24 నిమిషాలకు ఫైనల్ కట్ చేసినట్లు తెలుస్తోంది. అంటే 164 నిమిషాల పాటు ఉంటుంది. వీటికి అద‌నంగా టైటిల్ క్రెడిట్స్, హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లు కలుపుకుని డాకూ మ‌హారాజ్ ఫైన‌ల్‌గా 2 గంటల 32 నిమిషాలకు లాక్ అయినట్లు తెలుస్తోంది. అంటే మ‌నం థియేట‌ర్లోకి ఎంట‌ర్ అయ్యాక 152 నిమిషాలు సినిమా చూడాలి.ఈ ఫైన‌ల్ ర‌న్ టైంపై మేకర్స్ నుంచి ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌తో కనిపిస్తాడు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest news