టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ట మల్లిడి తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. చిరంజీవి హీరోగా మూడున్నర దశాబ్దాల క్రిందట వచ్చిన బ్లాక్ బస్టర్ జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సోషియో ఫాంటసీ సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ సోసియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు.అలాగే గతేడాది రెండు సినిమాలు సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టిన చిరు … ఆ వెంటనే భోళా శంకర్ సినిమా తో మాత్రం బాగా డిజప్పాయింట్ చేశాడు. ఇక 2024 క్యాలెండర్ ఇయర్ లో మాత్రం చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ఇప్పుడు విశ్వంభర వచ్చే సంక్రాంతికి వస్తుందనుకున్నా సమ్మర్‌కు వాయిదా పడింది. విశ్వంభర తర్వాత చిరు నాని నిర్మాతగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.
ఆ తర్వాత మళ్లీ అనిల్ రావిపూడితో ఓ సినిమా ఉంటుంది. ఆ వెంటనే మళ్లీ వాల్తేరు వీరయ్య కాంబినేషన్ కూడా ఉన్నట్టుగా ఇపుడు బజ్ వినిపిస్తుంది. దర్శకుడు బాబీ కొల్లి ప్రస్తుతం బాలయ్యతో డాకూ మహారాజ్ సినిమా తెరకెక్కిస్తోన్న సినిమా సంక్రాంతికి వస్తోంది. అసలే హిట్ కోసం చకోరా పక్షిలా వెయిటింగ్‌లో ఉన్న చిరు.. ఇప్పుడు డాకూ మహారాజ్ రిజల్ట్ తర్వాత మళ్లీ బాబితో ఫిక్స్ అయ్యే ఛాన్సు ఉంది.