Moviesమెగా కుటుంబాన్ని దారుణంగా టార్గెట్ చేసిన బన్నీ.. ఇంత లోతు దింపేసాడుగా..!

మెగా కుటుంబాన్ని దారుణంగా టార్గెట్ చేసిన బన్నీ.. ఇంత లోతు దింపేసాడుగా..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా గత రాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమాకు తొలి ఆట నుంచే అదిరిపోయే టాక్ వచ్చేసింది. ఇదిలా ఉంటే గత కొన్ని ఏళ్లుగా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లో ఫ్యామిలీ అన్న వార్‌ నడుస్తోంది. సోషల్ మీడియాలోనూ మెగా అభిమానులు వేరు, అల్లు అభిమానులు వేరు అన్నట్టుగా వాతావరణం కనిపిస్తుంది. సాయిధరమ్ తేజ్ తప్ప మిగిలిన మెగా హీరోల నుంచి కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి మద్దతు లభించలేదు.Pushpa 2 The Rule Review: పుష్ప గాడి పాన్ ఇండియన్ రూల్ షురూ..! సినిమా ఎలా  ఉందంటే | Allu arjun rashmika mandanna starrer pushpa 2 movie review | TV9  Teluguమెగా అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఇలా ఎవరు పుష్ప కు సపోర్ట్ చేయలేదు. జనసేన అభిమానులు, కార్యకర్తలు అయితే పుష్ప 2 సినిమాను బాయికాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా సినిమాలో బన్నీ చెప్పిన ఓ డైలాగ్ ఇప్పుడు కాంట్రవర్సీ అవుతోంది. ఈ డైలాగ్ మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పెట్టిందే అంటున్నారు.

సినిమాలో బన్నీ ఎవడు రా బాస్.. ఎవడికి రా బాస్.. ఆడికి, ఆడి తమ్ముడికి, ఆడి కొడుక్కి నేనేరా బాస్ అన్న డైలాగ్ చెప్తాడు. ఇది కథలో భాగంగా తాను ఎర్రచందనం స్మగ్లర్ నాయకుడు కావడంతో.. ఆ డైలాగ్ చెప్తాడు.
కానీ.. ఈ డైలాగ్ మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కొడుకు రామ్ చరణ్, చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సూటిగా తగిలేలా ఉందన్న సెటైర్లు చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి.

Chiranjeevi : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు.. చిరంజీవి ఫైర్‌ - Jaiswaraajya  TVఏది ఏమైనా అసలే మెగా అభిమానులు, అభిమానులు మధ్య వైరం నడుస్తున్నప్పుడు.. ఇలాంటి డైలాగులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని పెట్టాల్సి ఉంది. కానీ.. సుకుమార్ ఎలా పెట్టాడో.. కనీసం బన్నీ అయినా ఇలాంటి డైలాగులు చెప్పేటప్పుడు ఇగ్నోర్ చేసి ఉండాల్సింది అన్న కామెంట్లు కూడా పడుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news