నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస విజయాల హీరోగా దూసుకుపోతున్నాడు .. అఖండతో మొదలైన బాలయ్య దండయాత్ర భగవంత్ కేసరి తో మరో రేంజ్ కు వెళ్ళింది .. ప్రస్తుతం వచ్చే సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. అలానే అఖండ 2 సినిమాను కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. . ఈ సినిమాను 2025 దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్టు రీసెంట్ గానే చిత్ర యూనిట్ కూడా ప్రకటించింది . అయితే ఇప్పుడు బోయపాటి అఖండ 2 పై మరో అదిరిపోయే అప్డేట్‌ను బయటికి వదిలారు.ఒకవైపు డాకు మహారాజ్ అంటూ సంక్రాంతికి యుద్ధం ప్రకటించిన బాలయ్య .. ఈలోపు అఖండ 2 ను సైతం రెడీ చేస్తున్నారు .. ఆసలు ఈ సీక్వెల్ పై చిత్ర యూనిట్ ఇచ్చిన అప్డేట్ ఏంటి ? దీని షూటింగ్ డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం.. ఇక బాలయ్య స్పీడ్ చూస్తుంటే ప్రస్తుతం కుర్ర హీరోలకు కూడా కుళ్ళు వచ్చేసింది అసలు అదేం స్పీడ్ రా బాబు అంటూ .. ఒకవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలను కూడా ఎడాపెడా పూర్తి చేసేస్తున్నాడు.అప్పటివరకు 40 కోట్లు దాటని బాలయ్య మార్కెట్‌ను 100 కోట్ల రేంజ్ వచ్చింది అఖండ తర్వాత .. వీర సింహారెడ్డి , భగవంత్ కేసరి సైతం 100 కోట్లకు పైగా కలెక్షను రాబట్టాయి. ఇక తాజాగా అఖండ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది .. RFC లో రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీలో ఫైట్ సీన్స్ షూటింగ్ ప్రారంభం కానుంది. డాకూ మహరాజ్ వచ్చే సంక్రాంతి వస్తున్న బాలయ్య అఖండ 2ను దసరాకు రెడీ చేస్తున్నాడు .. సెప్టెంబర్ 25 , 2025లో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.. 14 వీల్స్ , బాలయ్య చిన్న కూతురు తేజస్విని అఖండ 2 సినిమాకు నిర్మాతలుగా ఉన్నారు .. గతంలో భగవంత్ కేసరి కూడా దసరాకు వచ్చి బాక్సాఫీస్ దుమ్ము దులిపింది .. 2025 లో కూడా సేమ్ సిన్ రిపీట్ చేయాలని బాలయ్య చూస్తున్నాడు.