సంథ్య థియేటర్ ఘటనలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు ఈ రోజు విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు అల్లు అర్జున్‌ను 20 ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు ఈరోజు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. మరీ ముఖ్యంగా అనుమతి లేకపోయినా ఎందుకు సంధ్య థియేటర్ కు వెళ్లారు ? మిమ్మల్ని థియేటర్‌కు రమ్మని పిలిచింది ఎవరు? మీతో పాటు ఉన్న మీ కుటుంబ సభ్యులు స్నేహితుల పేర్లు ఏమిటి ? థియేటర్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చారు ? మీరు ఎంతమంది బౌన్సర్లను పెట్టుకున్నారు మీ వ్యక్తిగత బౌన్సర్లు ఎంతమంది ? థియేటర్ మేనేజ్మెంట్ ఎంతమంది బౌన్సర్లను నియమించిందన్న ప్రశ్నలు వేయనున్నారు.
అలాగే పుష్ప 2 నిర్మాతలు ఎంతమంది బౌన్సర్లను పెట్టారు ? మీకు పోలీసులు ఏమని చెప్పారు ? ఇలాంటి ప్రశ్నలు బన్నీ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. వీటన్నిటికంటే ముఖ్యంగా బన్నీకి కొన్ని వీడియోలను చూపించినట్లు సమాచారం. ఈ వీడియోలపై పని అభిప్రాయాలు తీసుకుని రికార్డ్ చేయబోతున్నారు. వీటిలో బన్నీ ఊరేగింపు సంబంధించిన వీడియోలో ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. వీటన్నింటిని కోర్టులో సమర్పిస్తారని అంటున్నారు. ఈరోజు బన్నీ చెప్పిన సమాధానాలు ఓకే అనుకుంటే ఓకే సరైన సమాధానం రాకపోతే మరోసారి రేపు బన్నీని విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
అల్లు అర్జున్ వెంట ఆయన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తో పాటు అతని లాయర్ కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఆంక్షలు విధించడంతోపాటు మీడియాను కూడా దూరంగా ఉంచారు.