టాలీవుడ్ యంగ్‌టైగర్ … మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ యేడాది దేవర లాంటి పాన్ ఇండియా హిట్ సినిమాతో తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది. ఆ వెంటనే దేవర 2 ఉంటుందని అంటున్నారు. ఈ మూడు సినిమాల లైనప్ చూస్తుంటేనే ఫ్యీజులు ఎగిరి పోతున్నాయి.
ఇక కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఎన్టీఆర్‌తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే కోలీవుడ్ యంగ్ క్రేజీ డైరెక్టర్ ఆర్ టీ నెల్సన్ సైతం ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా కోసం ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. సితార బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ ఇద్దరి కలయికలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును సెట్ చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్టీఆర్ – నెల్సన్ మధ్య ఓ సిట్టింగ్ కూడా జరిగిందట. ఎన్టీఆర్ కాస్త ఫ్రీ అయ్యాక… వార్ 2 సినిమా షూటింగ్ అయిన వెంటనే నెల్సన్ కథ వినేలా నిర్మాత నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు. కథ నచ్చితే ఆ వెంటనే ఈ సినిమాను ఎలా లాంచ్ చేయాలి.. షూటింగ్ ఎప్పుడు ఉంటుంది ? అన్నదానిపై క్లారిటీ ఉంటుంది. ఇక నెల్సన్ తమిళంలో జిల్లా, జైలర్, బీస్ట్ లాంటి సినిమాలు తెరకెక్కించారు.