మెగా బ్రదర్ నాగబాబు వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు వరుణ్ తేజ్. కెరీర్ ప్రారంభంలో కొన్ని మంచి సినిమాలు పడ్డాయి.. మరి ముఖ్యంగా ఫిదా – ఎఫ్2 లాంటి సినిమాలు అలాగే గద్దల కొండ గణేష్ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ కు మంచి ఊపు ఇచ్చాయి. ఒక్కసారిగా టైర్ 2 హీరోలలో టాప్ పొజిషన్‌కు చేరుకున్నాడు. మీడియం రేంజ్ హీరోలలో వరుణ్ తేజ్ కు ఏకంగా రు. 10 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కథల వినడం మర్చిపోయి.. రెమ్యూనరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడో ఏమో కానీ ఎఫ్ త్రీ అనుకున్న స్థాయిలో ఆడలేదు.. అది మల్టీ స్టారర్..!
దానిని పక్కన పెట్టేస్తే సోలో హీరోగా చేసిన చివరి 4 సినిమాలు అతిపెద్ద డిజాస్టర్లు అయ్యాయి. ఈ నాలుగు సినిమాలు వరుణ్ తేజ్ పరువు పూర్తిగా తీసేసాయి. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మించిన గని సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకు రెండు కోట్ల షేర్ కూడా రాలేదు అంటే ఎలాంటి దారుణ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది వరుణ్ తేజ్ కు పెద్ద పీడకలగా మిగిలిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు డిజాస్టర్లు అయి కూర్చున్నాయి. ఆపరేషన్ వాలెంటైన్ ఆ తర్వాత గాండీవ ధారి అర్జున .. ఇక తాజాగా కరుణ్ కుమార్ దర్శకత్వంలో చేసిన మట్కా సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయింది.
ఒకే ఏడాది మూడు పెద్ద డిజాస్టర్లు అంటే మామూలు విషయం కాదు. ఇక వరుణ్ తేజ్ గత చివరి 4 సినిమాలతో టాలీవుడ్ లో ఏకంగా రు. 100 కోట్లకు పైగా నష్టం వచ్చింది. వరుణ్ తేజ్ సినిమా కొన్న బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ దారుణంగా నష్టపోయారు. ఏది ఏమైనా వరుణ్ తేజ్ తర్వాత సినిమాకు బయ్యర్లు ఎగ్జిబిటర్లు .. చివరకు థియేటర్లు కూడా కరువు అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇకపై అయినా రెమ్యూనరేషన్ పక్కన పెట్టి సరైన కథా బలం ఉన్న సినిమాలు మంచి దర్శకులను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తే బాగుంటుంది.