Moviesమ‌హేష్ ' ఖ‌లేజా ' ఎందుకు ప్లాప్ అయ్యింది... మ‌నిషి ఆలోచ‌న...

మ‌హేష్ ‘ ఖ‌లేజా ‘ ఎందుకు ప్లాప్ అయ్యింది… మ‌నిషి ఆలోచ‌న మారాల‌ని చెప్పిన పోస్ట్‌…!

ఖలేజా ఎండింగ్ కార్డ్స్: ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే..
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే..
ఓం శాంతి శాంతి శాంతిః అని..
ఫ్లాపైనా గానీ చూసిన ప్రతీసారీ కొందరి ఆలోచనా విధానాన్ని మార్చిన సినిమా..
ఆకలేస్తున్నప్పుడు ఎవరైనా ఓ ముద్ద పెడితే బాగుణ్ణని ఆకాశంలోకి చూసేవేళ అనుకోకుండా వచ్చి కడుపునింపిన అన్నదాతే కంటికి కనిపించే ‘దేవుడు’..
రోడ్డుమీద దెబ్బలు తగిలి నెత్తురోడుతున్న అపాయకర పరిస్థితుల్లో పనులు మానుకుని మరీ ఆసుపత్రికి తరలించే ఆపద్బాంధవుడే పేరు తెలీని ఓ ‘దేవుడు..’
దేవుడంటే ఎవరో కాదు భయ్యా.. సాయం.. నీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడు.. అంటే దైవం మనుష్య రూపేణా.. మనిషి నమ్మకంతో వెతికితే దేవుడు ఎక్కడో కాదు.. మనచుట్టూనే ఏదో రూపంలో కనిపిస్తాడు..
అదే ఈ సినిమా కాన్సెప్ట్..

స్టార్ హీరోతో గొడవ పడిన త్రివిక్రమ్ శ్రీనివాస్? | clashes between director trivikram  srinivas and hero vikram - Telugu Oneindia

భూగర్భంలో ఉన్న ఖనిజాల కోసం పాలి అనే గ్రామాన్ని చాలా ప్రోగ్రెసివ్‌గా నాశనం చేసే ఓ కార్పోరేట్ కంపెనీ.. ఊళ్ళో ఏం జరుగుతుందో అర్ధంగాక తమని ఆదుకోవడానికి దేవుడే వస్తాడని ఆశగా ఎదురుచూసే జనం.. నువ్వు దేవుడివి అని ఊరంతా తన మీద పెట్టిన నమ్మకాన్ని తను నమ్మకపోయినా వాళ్ళ మంచి కోసం ప్రయత్నించి ఆఖరికి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టిన హీరో..
కొన్ని సినిమాలను ఒకసారి చూస్తే సూపరెహే అనిపిస్తాయి . రెండోసారి చూస్తే జస్ట్ యావరేజీ అని, మూడోసారి చూస్తే బోరింగ్గానూ అనిపిస్తాయి.. ఇంకొన్ని సినిమాలు మొదటిసారి చూసినప్పుడు అర్ధం కాలేదనిపించో లేక ఫర్వాలేదనిపించో, రెండోసారి చూసినప్పుడు బాగానే ఉందనిపించి, మళ్లీ మళ్లీ టీవీల్లో చూసినప్పుడు అసలు ఎందుకు ప్లాపయ్యిందంటావ్ అని ప్రశ్నలు రేకెత్తిస్తాయ్.. అలాంటి సినిమానే ఇది.. భారీ అంచనాలతో, రాంగ్ ప్రమోషన్స్‌తో, ఇంకొన్ని లేకిసీన్లతో, హెవీ కాంపీటీషన్లో వచ్చిన ఈ సినిమాలో లోతుని అప్పట్లో జనాలు అర్ధం చేసుకోలేదని నిందలేసేకంటే రూపకర్తలే జనానికి అర్ధమయ్యేలా తెరకెక్కించడంలో విఫలమయ్యారంటే బాగుంటుంది.. మంచి స‌బ్జెక్ట్‌ను ఎంచుకున్న త్రివిక్ర‌మ్ తెర‌పై ప్ర‌జెంట్ చేయ‌డంలో తాత్వికత, సైన్సు ఎక్కువయ్యేసరికి త‌డ‌బ‌డ్డాడు.

మహానటి దర్శకుడు నాగ్అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు.. ఖలేజా గనుక హిట్టయ్యుంటే త్రివిక్రమ్‌ గారి రచనా విధానం మరోస్థాయిలో ఉండేదని.. ఈ సినిమా ఫలితం త్రివిక్రంని ఆలోచనలో పడేసి, నేలమీద కాకుండా ఆకాశంలో నడిచే కార్పోరేట్ కుటుంబకథలకి పరిమితం చేసేసింది..
ఈ సినిమా అంతా అయిపోయాక ఎండింగ్లో స్క్రీన్ మీద ఈశావాస్యోపనిషత్‌కి సంబంధించిన ఒక శ్లోకం స్క్రోల్ అవుతుంది..
దానికి అర్ధం తెలుసుకోవాలని రీసెర్చి చేస్తే ఇంకొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి.. అప్పట్నుంచీ ఈ సినిమాతో తెలీకుండానే ప్రేమలో పడిపోయి అక్కర్లేని చెత్తనంతా పక్కనపెట్టి మరో కోణంలో చూడటం పరిపాటి..

Watch Khaleja Movie Online | Buy Rent Khaleja On BMS Stream

అంతకుముందు సిల్లీగా అనిపించిన మహేష్- రావురమేష్ – షఫీ త్రయం మధ్య సన్నివేశాలు దానితర్వాత ఇంకోలా కనబడ్డాయి.. మన నమ్మకమే మనల్ని నిలబెట్టి, నడిపిస్తుంది.. మన నమ్మకమే అసలైన నిజం. ముందు మన మీద మనకు నమ్మకముంటే అప్పుడు దేవుడే కలిసొస్తాడు..!!
ఎండింగ్ కార్డ్స్‌లో సీన్ మీద స్క్రోల్ అయ్యే ఆ శ్లోకం..
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే..
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే..
ఓం శాంతి శాంతి శాంతిః అని..
మన కంటికి కనబడని పరబ్రహ్మ పూర్ణ స్వరూపం.. మనకి కనిపించే జగత్తు కూడా పూర్ణమే.. ఆ పరబ్రహ్మ నించే జగత్తు కూడా ఉద్భవిస్తోంది.. దేవుడి సృష్టి అనంతం.. పదార్ధం మరియు శక్తి అనంతం.. కాబట్టి సృష్టి అనేది ఆగనిది.. కల్పితమనే ఈ ప్రపంచం కూడా పూర్ణమే..
దీన్ని కాస్త సింపుల్‌పై చేస్తే క్వాంటం ఫిజిక్స్ థియరీకి ఇదే ఫండమెంటల్.. క్వాంటం థియరీని ఒక్కముక్కలో చెప్పాలంటే “ఈ ప్రపంచాన్ని మనం చూసే విధానం తప్పు.. అసలు ప్రపంచం వేరే ఉంది” అని.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఓ ఇంట్ర‌స్టింగ్ పోస్టు ఆధారంగా రాసిన ఆర్టిక‌ల్‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news