Moviesప్రేమ‌దేశం వినీత్ భార్య ఎవ‌రు... ఎక్క‌డుంటారో తెలుసా..!

ప్రేమ‌దేశం వినీత్ భార్య ఎవ‌రు… ఎక్క‌డుంటారో తెలుసా..!

1990వ దశ‌కంలో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా వెలుగుందాడు హీరో వినీత్. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలో అనేక సినిమాలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. జెంటిల్మెన్, సరిగమలు, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి తదితర సినిమాలు వినీత్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అన్నట్లు హీరోగానే కాకుండా వినీత్ మంచి డ్యాన్సర్ కూడా. భరతనాట్యంలో అనేక కచేరీలలో తన ప్రతిభ ప్రదర్శించారు.సినిమాల సంగతి పక్కన పెడితే వినీత్ పలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వినయ్ 2004 ఆగస్టు 28న చెన్నైకు చెందిన ప్రిన్సిల్లా మీనన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అవంతి వినీత్ అనే పాప కూడా ఉంది. వినీత్ ఫ్యామిలీ సాధారణంగా బయట ఎక్కువగా కనిపించరు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వినీత్ ఫ్యామిలీ ఫోటోలు చక్కెర్లు కొడుతున్నాయి. సినిమాల పరంగా సరైన కథనాలు ఉంటే రి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news