నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అనుష్టాపబుల్ షో కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తొలి ఎపిసోడ్ ఇప్పటికే ప్రసారమైంది. మరో రెండు రోజుల్లో రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రానుంది . ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మాట్లాడిన కొన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరియు ముఖ్యంగా బన్నీ తన సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది.తనకు ఒక సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ ఉందని .. అందులో కేవలం తను తన సతీమణి మాత్రమే సభ్యులు అని చెప్పినట్టు సమాచారం.. గొడవలు.. దాని తర్వాత జరిగే చర్చలు ఇందులో ఉంటాయని.. ఇతరుల గురించిన రహస్యాలు కూడా ఈ గ్రూపులో మాట్లాడుకుంటామని బన్నీ చెప్పినట్టు తెలుస్తోంది. తన సతీమణి స్నేహారెడ్డి గురించి ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ చాలా అరుదుగా మాట్లాడుతూ ఉంటాడు. పలు సందర్భాలలో బన్నీ తన ప్రాముఖ్యతను మాత్రమే పంచుకున్నారు.ఆమె వల్ల తను ఎంతో మారిన అని చెప్పారు. వివాహ బంధం బలంగా ఉండాలంటే పరస్పరం గౌరవం ఇచ్చుపించుకోవాలని.. బాలయ్య షోలో బన్నీ చెప్పారు. ఇదే కార్యక్రమంలో అల్లు అర్జున్ తనయుడు అయాన్… కుమార్తె అల్లు అర్హ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఇది నవంబర్ 22న స్ట్రీమింగ్ కు రానుంది. ఇక బన్నీ పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.