వరుణ్‌తేజ్ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. ఆయన పనేదో ఆయన చూసుకుంటూ ఉంటారు. సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా కాంట్రవర్సీలకు ఉండవు. అయితే తాజాగా వరుణ్‌తేజ్ మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వరుణ్ తేజ్ నో సెకండ్ అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు అల్లు అర్జున్ను టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయి. ఇవే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. విశాఖలో వరుణ్ వితిన్ నో సెకండ్ అంటూ చేసిన కామెంట్ల రచ్చ అల్లు అభిమానులను బాగా కెలికేసినట్టుగా ఉంది.
వితిన్ నో సెకండ్ అనే మాటలను జనాలు.. సినీ లవర్స్ కూడా అల్లు అర్జున్‌కు కనెక్ట్ చేసేసుకున్నారు. తను తన ఫ్యామిలీ గురించి తరచూ ఎందుకు ? మాట్లాడతాను ? ఎందుకు తలచుకోకూడదు అనే కాన్సెఫ్ట్‌లో వరుణ్ కొన్ని మాటలు మాట్లాడారు. రెండు మూడు హిట్లు వచ్చినంత మాత్రానా మనం ఎక్కడ నుంచి వచ్చాం.. మన వెనక ఎవరు ? ఉన్నారు అన్నది అస్సలు మర్చిపోకూడదు అని వరుణ్ మాట్లాడారు.
సహజంగానే ఈ మాటలు అల్లు అర్జున్‌కు తగిలేలా ఉన్నాయి. మెగా హీరోలు ముందుకు వస్తే ఆ ఫ్యామిలీలో మెగాస్టార్, పవర్ స్టార్ ప్రస్తావన లేకుండా స్పీచ్‌లు ఉండవు.. కానీ అల్లు అర్జున్ వీటిని ఎవాయిడ్ చేస్తూ వస్తున్నారు. వరుణ్ కూడా తన బాబాయ్ పవన్ గురించి గొప్పగా చెప్పుకుని ఉండవచ్చు.. కానీ అలా కాకుండా ఎక్కి వచ్చిన మెట్లను మర్చిపోతే అన్నట్టుగా మాట్లాడడం అల్లు అర్జున్ను కెలికినట్టే అన్న గుసగుసలు నడుస్తున్నాయి.