తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒకప్పుడు యూత్ ను ఎంతో ఆకట్టుకున్న వారిలో తరుణ్ – ఉదయ్ కిరణ్ – సదా – ఆర్తి అగర్వాల్ ఒకప్పటి టాలీవుడ్ సెన్సేషన్ స్టార్స్.. ప్రధానంగా లవ్ సినిమాలకు వీరు కేరాఫ్ అడ్రస్. తమ సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తరుణ్ – ఉదయ్ కిరణ్ లవర్ బాయ్స్ అప్పటి యువతకి ఫేవరెట్ హీరోలు .. అలాగే అమ్మాయిల కలల రాకుమారులు. అలాగే సదా – ఆర్తి అగర్వాల్ కూడా అప్పటికి చాలామంది యువతకు ఫేవరెట్ హీరోయిన్స్. అయితే దురదృష్టవశాత్తు వీరులో ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ ఇప్పుడు మన మధ్య లేరు.
ఇక తరుణ్ – సదా ఇద్దరూ కూడా ప్రస్తుతం సినిమాలు కు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ నలుగురు కలిసి దిగిన ఒక ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఫోటోను 2005లో తీసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఫోటోను హైదరాబాద్ హుస్సేన్ సాగర్ బోట్లో కూర్చున్న సమయంలో తీసిన ఫోటో ఇది. 2005లో తరుణ్ – ఆర్తి అగర్వాల్ జంటగా సోగ్గాడు సినిమా , ఉదయ్ కిరణ్ – సదా జంటగా ఔనన్నా కాదన్నా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కేవలం వారం రోజుల వ్యవధి లోనే ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి .
అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఓ ఈవెంట్లో వీరు హైదరాబాద్ దగ్గర హుస్సేన్ సాగర్ లో సందడి చేశారు . సరదాగా బోట్ లో షికారు చేస్తూ ఫోటోలు కూడా దిగారు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవ్వటంతో సిని ప్రేక్షకులు అభిమానులు నెటిజెన్లు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ప్రధానంగా ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ ను గుర్తు చేసుకుంటూ పలు ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. అలాగే తరుణ్ – సదా మళ్ళి రీ ఎంట్రీ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు.