టాలీవుడ్ లోనే కాదు ఏపీలో అయినా .. అబ్బాయిలు.. అమ్మాయిలు ప్రేమలో పడటం.. ఒకవేళ పెళ్లి అయినా ఒక రంగంలో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎఫైర్లు పెట్టుకోవడం.. సహజీవనాలు చేయటం కామన్ గా నడుస్తూ ఉంటాయి. ఇక సినిమా రంగంలో అవకాశాల కోసం ఇలాంటి సంబంధాలు చాలా కామన్ గా పెట్టుకుంటూ వస్తారు. కొందరు అవసరాల కోసం కొద్ది రోజుల పాటు ఎంజాయ్ చేసి తప్పించుకుంటూ ఉంటారు.. సినిమా రంగంలో హీరోలు.. హీరోయిన్లు – హీరోయిన్లు .. దర్శకులు – హీరోయిన్లు .. నిర్మాతల మధ్య రిలేషన్లు కామన్ గా నడుస్తూ ఉంటాయి. టాలీవుడ్ లో ఇలాంటి ఎఫైర్లు చాలా కామన్ గా ఉంటాయి.
ఈ క్రమంలోనే ఈ ఏడాది ఓ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు ఒకరు ఉన్నారు ఆయన భార్య విదేశాల్లో ఉంది. ఇక్కడ ఏం చేయాలి ? అందుకే ఓ హీరోయిన్ తో సహజీవనం సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ హీరోయిన్ కు పెద్దగా అవకాశాలు లేవు. తొలి సినిమా హిట్ .. అటు గ్లామర్ కంటెంట్ కు తక్కువ .. ఇటు క్లాసెస్ సినిమాలు తక్కువ. ఇలాంటి అప్పుడు అవకాశాలు ఎలా వస్తాయి ? అప్పుడప్పుడు గ్లామర్ చూపిస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో వదులుతున్నా పెద్దగా పట్టించుకున్న వారు లేరు. ఇలాంటి నేపథ్యంలో ఆ దర్శకుడికి ఈ హీరోయిన్ కు ఎక్కడో కనెక్ట్ అయింది. సో వీరిద్దరూ కలిసి హైదరాబాదులో ఒక గదిలో చాలా సీక్రెట్ గా సహజీవనం మొదలు పెట్టేశారు.
ఈ సహజీవనం పుణ్యమా అని ఒక సినిమాలో చిన్న పాత్ర కూడా ఆ హీరోయిన్ కు దర్శకుడు ఇప్పించారు. ఈ ఏడాది ఏదో అలా 3 – 4 సినిమాలతో గడిచిపోయింది. ఆ హీరోయిన్ కు వచ్చే ఏడాది సినిమాలు ఉంటాయా లేదా సహజీవనం పుణ్యంతో ఆ దర్శకుడు ఆమెకు మరిన్ని ఆఫర్లు ఇప్పిస్తాడా అన్నది చూడాలి. విచిత్రం ఏంటంటే సదరు దర్శకుడు చేస్తున్న తాజా సినిమాలో కూడా ఆమెకు మళ్ళీ ఓ పాత్ర ఇచ్చారు.. ఏది ఏమైనా సహజనం ఆ హీరోయిన్ కు మంచి అవకాశాలు తెచ్చిపెడుతోంది.