Moviesబాబోయ్ ' పుష్ప 2 ' సినిమా చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే...!

బాబోయ్ ‘ పుష్ప 2 ‘ సినిమా చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే…!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా వచ్చేనెల ఐదున ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే అన్ని ఏరియాలలో ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచనున్నారు. మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో టిక్కెట్ రేట్లు ఆకాశాన్ని అంటనున్నాయి. నైజాం ఏరియాలో భారీగా పెంచడానికి రంగం సిద్ధం అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని అడ్డు చెబితే తప్ప పుష్ప 2 టికెట్ రేట్లు భారీగా ఉండబోతున్నాయి. ఈ మేరకు అదనపు రేట్లు కోరాలని పుష్ప 2 నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. సింగల్ స్క్రీన్ రేట్లు రు. 325 పాతిక నుంచి రు. 400 వరకు ఉండే అవకాశం ఉంది. 2 డీ వెర్షన్ – 3d వెర్షన్ బట్టి రేటు ఉంటుంది.అలాగే మల్టీప్లెక్స్ లో రేటు అయితే 500 నుంచి 600 వరకు ఉండే అవకాశం ఉంది. సరే వీరాభిమానులు అభిమానులు అయితే అపోసొప్పో చేసి టిక్కెట్లు కొనుక్కుంటారు అని అనుకోవటానికి కూడా లేదు. ఈ మధ్య టాలీవుడ్ జనాలకు కొత్త సూత్రం కనిపెట్టారు. ముందు రోజు వేరే ప్రీమియర్ షోల టికెట్లు అన్నీ గుత్తగా ఇచ్చేస్తున్నారు. ఎన్ని టిక్కెట్లు ఉంటే అన్ని వేలు.. అంటే టికెట్ 1000 రూపాయలు.. టిక్కెట్ మీద రేటు తక్కువే ఉంటుంది.. కానీ అమ్మటం ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. షో మొత్తం టికెట్లు తీసుకుని ఆపైన అమ్ముకుంటారో.. స్నేహితులకు ఇచ్చుకుంటారో వారి ఇష్టం.కొన్ని థియేటర్లలో అయితే అర్ధరాత్రి షోల టికెట్ రేట్లు ఏకంగా 1500 నుంచి 2000 వరకు పలుకుతున్నాయి. ఇండస్ట్రీ జనాలు వారిలో వారికి ఉన్న స్నేహాలతో వారి సినిమాను వీరు.. వీరు సినిమాను వారు షోల లెక్కన కొనుక్కుంటున్నారు. కొన్నిసార్లు ఫ్యాన్స్ కొనుక్కుని అమ్ముకుంటున్నారు. అందువల్ల అన్ని థియేటర్లలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు తొలిరోజు టిక్కెట్లు దొరుకుతాయని గ్యారెంటీ కూడా లేదు. ఇదంతా హీరోల మీద.. కాంబినేషన్ల మీద జనాల్లో ఉన్న క్రేజ్ ఫలితం. అదే జనాలు సైలెంట్ గా ఉంటే టిక్కెట్ రేట్లు అవే దిగి వస్తాయి. ఏది ఏమైనా ఇప్పుడు టెక్కెట్ రేట్లు చూసి.. చాలామంది ఈ టిక్కెట్లతో కెమెరా అంతా వెళ్లి సినిమా చూడాలి అంటే ఓ చిన్నపాటి ఆస్తి అమ్ముకొక తప్పదేమో అని సెటైర్లు వేసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news