టైటిల్: మెకానిక్ రాకీ
నటీనటులు : విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేష్, హర్ష వర్ధన్, ఆది, హర్ష చెముడు.
మ్యూజిక్ : జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి
ఎడిటింగ్ : అన్వర్ అలీ
నిర్మాత : రామ్ తళ్లూరి
దర్శకత్వం : రవితేజ ముళ్ళపూడి
రిలీజ్ డేట్: 22 నవంబర్, 2024
పరిచయం :
ఈవారం థియేటర్లోకి వచ్చిన లేటెస్ట్ సినిమాలలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా మీనాక్షి చౌదరి.. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కించిన సినిమా మెకానిక్ రాకీ రిలీజ్ ముందు మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ :
రాఖీ ( విశ్వక్సేన్ ) తన తండ్రి నరేష్ పెట్టిన మెకానిక్ గ్యారేజ్ లో పనిచేసుకునే మాస్ కుర్రాడు. ఊహించిన రీతిలో తన లైఫ్ లో జరిగిన ఓ ట్రాజెడీ సంఘటన కారణంగా చాలా ఇబ్బంది పడతాడు. రంకిరెడ్డి ( సునీల్ ) వల్ల వచ్చిన సమస్య ఏంటి ? దీంతోపాటు రాఖి ఎదుర్కొన్న మరికొన్ని ఇబ్బందులు ఏంటి ? ప్రియా ( మీనాక్షి చౌదరి ) అలాగే మాయా ( శ్రద్ధ శ్రీనాథ్ ) పాత్రలు ఏంటి రాఖీ తన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా విషయాన్ని ముందే రివీల్ చేయకుండా చేసిన పని థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. టీజర్ .. ట్రైలర్లను చాలా సాదాసీదా మాస్ డ్రామాగా కట్ చేశారు. కానీ వాటిని చూసి తక్కువ అంచనాలు పెట్టుకునే వారిని ఈ సినిమా ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది అనటంలో సందేహం లేదు. విశ్వక్ మరోసారి తన కథ ఎంపికలో సాలిడ్ గా ఉంటాడు అని ప్రూవ్ అయింది. సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం సాలిడ్ హైలెట్.. క్రేజీ ట్విస్టులు.. మంచి కామెడీ తో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో వెళుతుంది. విశ్వక్ మరోసారి తన మార్క్ మాస్ షేడ్‌తో దుమ్ము లేపాడని చెప్పాలి. మంచి ఎమోషన్లతో పాటు పలు సీన్లు వేరియేషన్ను చూపించి తన ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. మెయిన్ నటీనటులు అందరూ వారి పాత్రలను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.
మీనాక్షి చౌదరి డీసెంట్ నటనతో మంచి ఎమోషన్తో ఆకట్టుకుంది. శ్రద్ధ శ్రీనాథ్ మాత్రం తన రోల్ తో ఇంప్రెస్ చేసింది. అయితే తనపై ట్విస్ట్ అయితే సినిమాలో అదిరిపోయింది. సినిమాలో సోషల్ మెసేజ్ దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం మెప్పిస్తాయి. హర్షవర్ధన్ – వైవా హర్షా తమ పాత్రలతో మెప్పిస్తారు.
ఈ సినిమాకు సెకండాఫ్ ప్రధాన బలం. అనూహ్యమైన మెరుపులు సినిమాను బాగా రక్తి కట్టించాయి. ప్రతి పాత్ర కూడా కొత్త మలుపుతో ఉంటుంది.. అప్పటిదాకా సాగిన కథకు బలం చేకూరుస్తుంది. సినిమా ఫస్ట్ ఆఫ్ లో ప్రేక్షకులు చాలా నిరాశకు గురవుతాడు. అయితే సెకండ్ హాఫ్ ఆ నిరాశను మొత్తం పొగుడుతుంది. మధ్యతరగతి ఆశ అవసరాలను ఆసరాగా చేసుకుని కొంతమంది చేసే మోసాలు నేపథ్యాలను చక్కగా చూపించారు. కథనంతో కట్టిపడేసే ప్రయత్నం ఎక్కువగా కనిపించింది.
భావోద్వేగ కోణాన్ని దర్శకుడు మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కొన్ని మలుపులు థ్రిల్ పంచుతాయి. విశ్వక్సేన్ తనకు అలవాటైన పాత్రలో చాలా హుషారుగా కనిపించాడు. హీరోయిన్లు మీనాక్షి చౌదరి – శ్రద్ధ శ్రీనాథ్ కు బలమైన పాత్రులు దక్కాయి.. ఇద్దరూ అందంగా కనిపించారు. నటనకు ప్రాధాన్యం ఉంది. మరి ముఖ్యంగా శ్రద్ధ శ్రీనాథ్ పాత్ర ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. టెక్నికల్గా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్. కెమెరా అద్భుతంగా ఉంది. ఫస్టాఫ్‌లో ఎడిటింగ్ పై కాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. దర్శకుడు రవితేజ ఎంచుకున్న కథ నేపథ్యం ఆయన కథ నా రచన మెప్పిస్తుంది. మాటలు అక్కడక్కడ నవ్వించాయి.. టెక్నిక్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకు ప్లస్ పాయింట్స్ కథలో మలుపులు.. అద్భుతమైన నటన.. హీరోయిన్ల పాత్రలు.. ఇక సెకండ్ హాఫ్ నేపథ్య సంగీతం… అలాగే ఫస్ట్ ఆఫ్ లో రొటీన్ సీన్లు కామెడీ కాస్త మైనస్.
ఫైనల్ పంచ్ : మెకానిక్ రాఖీకి కాస్త రిపేర్లు ఉన్నా మెప్పిస్తాడు.
మెకానిక్ రాఖీ రేటింగ్ : 2.75 / 5