టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటించారు. మహేష్ బాబు, శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా మహేష్ బాబు స్థాయి సినిమా కాదు అన్నది వాస్తవం. ఇదిలా ఉంటే రాజకుమారుడు సినిమాతో హీరో అయిన మహేష్ బాబు.. ఒక్కడు సినిమాతో తిరుగులేని స్టార్డం తెచ్చుకున్నారు. ఆ తర్వాత పోకిరి ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది. పోకిరి సినిమా 2006 లో వచ్చింది.ఆ వెంటనే గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సైనికుడు సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయ్యింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై చలసాని అశ్వినీ దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మహేష్ బాబు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత మహేష్ బాబు కచ్చితంగా హిట్ట్ కొడతాడన్న ఆశలతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అతిధి సినిమా చేశారు. యూటీవీ వాళ్ళు నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అమృత ఆరోరా హీరోయిన్ గా నటించింది. సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ ఎలా ఉన్నా… సినిమా ప్రేక్షకులను బాగా కన్ఫ్యూజ్ చేసింది.అతిధి డిజాస్టర్ అయింది. 2007లో వచ్చిన ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మళ్లీ మూడేళ్ల పాటు ప్రేక్షకుల ముందుకు రాలేదు. 2007లో మహేష్ అతిథి సినిమా చేశారు.. ఆ తర్వాత మూడేళ్లకు 2010లో ఖలేజా సినిమా చేశాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. అతిధి సినిమా తర్వాత మహేష్ బాబు రెండేళ్ల పాటు అసలు ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి. అసలు ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో తెలియని కన్ఫ్యూజ్ లోకి మహేష్ బాబు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ను నమ్మి ఖలేజా సినిమా చేసినా ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత శ్రీను వైట్లతో దూకుడు సినిమా చేస్తే సూపర్ డూపర్ హిట్ అవడంతో అక్కడి నుంచి మహేష్‌కు తిరుగు లేకుండా పోయింది. వరుస సూపర్ సూపర్ హిట్లతో దూసుకుపోయారు.