Moviesతమిళ హీరో 250 కోట్లు - మలయాళ హీరో 100 -...

తమిళ హీరో 250 కోట్లు – మలయాళ హీరో 100 – తెలుగు హీరో 50 కోట్లు.. క‌థే హీరో…!

కంటెంట్ బాగుంటే ఏ సీజన్ లోనైనా జనాలు థియేటర్లకు వస్తారని ఈ ఏడాది పండుగ నిరూపించింది. 2024లో ఇండియన్ సినిమాకి దీపావళి మోస్ట్ సక్సెస్ ఫుల్ సీజన్ గా నిలిచింది. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నేళ్ల నుంచి దసరాని బెస్ట్ సీజన్ గా, దీపావళిని డ్రై సీజన్ గా భావిస్తూ వస్తున్నారు. అందుకే దీపాల పండక్కి పెద్ద హీరోల సినిమాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు వెనుకడుగు వేస్తారు. కానీ కంటెంట్ బాగుంటే ఏ సీజన్ లో అయినా జనాలు థియేటర్లకు వస్తారని ఈ ఏడాది దీపావళి నిరూపించింది. 2024లో ఇండియన్ సినిమాకి ఈ పండుగ మోస్ట్ సక్సెస్ ఫుల్ సీజన్‌గా నిలిచింది.

భారతీయ చిత్ర పరిశ్రమలో ఈసారి దీపావళికి రిలీజైన చిత్రాల్లో ఒకేసారి 5 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. ‘అమరన్’, ‘లక్కీ భాస్కర్’, ‘క’ వంటి మూడు సౌత్ మూవీస్ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. తమిళ హీరో నటించిన సినిమా రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే, మలయాళ హీరో మూవీ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. మన తెలుగు హీరో చేసిన సినిమా రూ. 50 కోట్ల మార్క్ ను టచ్ చేసింది.

శివ కార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ”అమరన్”. ఉగ్రదాడిలో వీర మరణం పొందిన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ గారి జీవితం ఆధారంగా ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన విషయం మనందరికి తెలిసిందే. హీరో కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమా.. రెండు వారాల్లో వరల్డ్ వైడ్ గా 280 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇది శివకార్తికేయన్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ మూవీ. మూడో వారంలోనూ మంచి వసూళ్లు వస్తుండటంతో, 300 కోట్ల క్లబ్ ను చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక ఇది కూడా తెలుగు సినిమానే కాకపోతే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తెలుగు సినిమా అంతే “లక్కీ భాస్కర్”. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.నాగవంశీ, త్రివిక్రమ్ గారి సతీమణి సాయి సౌజన్య గారు సంయుక్తంగా నిర్మించారు. ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ అసాధారణమైన జీవిత ప్రయాణం నేపథ్యంలో ఈ పీరియడ్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100.9 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది దుల్కర్ కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల క్లబ్ మూవీ.

Amaran movie poster . #amaran #amarandiwali ...

మరీ..! మన తెలుగు తేజం కిరణ్ అబ్బవరం స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రం “క”. దర్శక ద్వయం సుజీత్‌ & సందీప్‌ ఈ పీరియాడిక్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను డైరెక్ట్ చేశారు. నయన్ సారిక, తన్వీ రామ్ కథానాయికలుగా నటించారు. విచిత్రమైన టైటిల్ తో వచ్చిన ఈ సినిమా.. ఎవరూ ఊహించని సంచలన విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. కిరణ్ కెరీర్ ను గాడిలో పెట్టింది. తాజాగా ఈ మూవీ రు. 50 కోట్ల క్లబ్ లో చేరినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇది యువ హీరోకి ఫస్ట్ 50 కోట్ల సినిమా.

Lucky Bhaskar

ఇలా దీపావళికి తెలుగులో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ముగ్గురు హీరోల కెరీర్ లోనే బెస్ట్ ఫిగర్స్ రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. ఒకేసారి మూడు సినిమాలు ఇంత పెద్ద హిట్టవ్వడం మామూలు విషయం కాదు. ఈ మూడూ బాక్సాఫీస్ వద్ద పోటీ లేకుండా సోలోగా విడుదలయ్యుంటే కలెక్షన్లు రెట్టింపు అయ్యేవనే అభిప్రాయాలు కూడా సినీ పరిశ్రమలో వ్యక్తం అవుతున్నాయి. అలా ఒక సినిమానే రిలీజయ్యి ఉంటే ఆ నిర్మాత పరిస్థితి ఊహించుకుంటే ఆ డబ్బులతో గాల్లో తేలినట్టుంది నాకైతే నిజంగా…. అంతిమంగా హీరో ఎవ‌రు ? భాష ఏంటి అన్న‌ది ఇక్క‌డ ప్ర‌ధానం కాదు.. కంటెంట్ ఈజ్ కింగ్ అంతే..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news