బాలీవుడ్లో హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నోరా ఫతేహి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. 201లో దిల్బర్ దిల్బర్ పాటతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది . కెరియర్ మొదట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అప్పటికీ ఆ తర్వాత టాప్ హీరోయిన్గా ఎదిగింది. హీరోయిన్ గానే కాకుండా డాన్సర్ గాను తనకంటూ మంచి ఇమేజ్ను తెచ్చుకుంది. హింది లోనే కాకుండా తెలుగులోనూ పలు సినిమాలో నటించింది.
టెంపర్, షేర్, లోఫర్, కిక్ 2, బాహుబలి వంటి పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది. ఇప్పుడు వరుణ్ తేజ్‌తో కలిసి నటించబోతుంది. వరుణ్ హీరోగా వస్తున్న తాజా మూవీ మట్కా లో ఈ బ్యూటీ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. అలాగే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో కూడా నటించిందట. కాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించినందుకు ఈ ముద్దుగుమ్మ భారీ మొత్తంలోని రెమ్యూనరేషన్ తీసుకుందట. ఈ సినిమాలో పాట కోసం ఏకంగా ఈ బ్యూటీ 30 లక్షల పైగా పారితోషకం తీసుకుందని తెలుస్తుంది. అయితే నోరాను గతంలో ఇద్దరు నిర్మాతలు గట్టిగానే మోసం చేశారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గతంలో ఈ బ్యూటీ చేసిన రెండు సినిమాలుకు నిర్మాతలు తనకు డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని నోరా ఆరోపించింది. ఇక వాటి గురించి తాను పట్టించుకోలేదని కూడా ఆమె చెప్పుకొచ్చింది. తన కెరియర్ తనకు ముఖ్యమని కూడా అంది కెరియర్ మొదట్లో నేను ఎన్నో ఇబ్బందులకు గురయ్యాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఏజెన్సీ వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు కాదు. నేను ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాను. నేను అందంగా లేనని నన్ను అవమానించారు. ఆ బాధ కోపంతో నేను నా ఫోన్ కూడా పగలగొట్టానని ఈ బ్యూటీ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ బ్యూటీ నోరా ఫతేహి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మరాయి.