టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు.. తన కెరీర్లో ఎన్నో సినిమాలలో నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఇక మహేష్ బాబు తన కెరీర్‌లో ఎంతోమంది దర్శకులు తీసుకు వచ్చిన ఎన్నో కథలను రిజెక్ట్ చేశారు. అందులో కొన్ని సూపర్ హిట్లు ఉన్నాయి. కొన్ని డిజాస్టర్లు కూడా ఉన్నాయి. కానీ.. మహేష్ బాబు ఒక దర్శకుడు చెప్పిన రెండు కథలను రిజెక్ట్ చేశారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ రెండు సినిమాలు కూడా మహేష్ బాబు చేసి ఉంటే మహేష్ కెరీర్ కు చాలా ప్లస్ అయ్యేది.
టాలీవుడ్ లో అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. క్లాస్ ఎంటర్టైనర్ మూవీలను తెరకెక్కిస్తూ తనకంటూ ఒక అద్భుతమైన దర్శకుడుగా శేఖర్ కమ్ముల మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల కొన్ని సంవత్సరాలు క్రితం సుమంత్ హీరోగా గోదావరి అనే సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. అక్కినేని హీరో సుమన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కథను మొదటగా శేఖర్.. మహేష్ బాబుకు వినిపించాడట. ఆ సమయంలో మహేష్ బాబు అంత క్లాస్ టచ్ ఉన్న సినిమా చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట.
దీంతో ఈ సినిమా కథ నచ్చిన కూడా మహేష్ ఈ మూవీని రిజెక్ట్ చేశారు. అయితే గోదావరి బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే శేఖర్ కమ్ముల కొన్ని నెలల క్రితం.. వరుణ్ తేజ్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా ఫిదా సినిమా తెరకెక్కించారు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. వరుణ్ పాత్రను మొదట శేఖర్ కమ్ముల.. మహేష్ బాబు చేయాలన్న ఉద్దేశంతో ఆయనకు కథ మొత్తం చెప్పారట. మొత్తం విన్న మహేష్.. సినిమా కథ సూపర్ గా ఉంది. కానీ.. ఇప్పుడు వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను అని చెప్పి ఈ సినిమా కూడా రిజెక్ట్ చేశారట. మహేష్ బాబు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రెండుసార్లు సినిమాలు చేయాల్సి ఉన్న రెండు సార్లు కూడా గోల్డెన్ ఛాన్స్ వదులుకున్నారు.