మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మట్కా .. పలాస, మెట్రో కథలు , కళాపురం, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాలతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణాకర్ ఈ సినిమాను తెర్కక్కించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు పీరియాటిక్ యాక్షన్ డ్రామగాక వచ్చిన ఈ మూవీ వరుణ్ కి ఎలాంటి హిట్ ఇచ్చిందో ఇక్కడ చూద్దాం.. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రయోగాలకు పెట్టింది పేరు కెరియర్ మొదటి నుంచి ఆయన ఎన్నో కొత్త సినిమాలు చేస్తూ వచ్చాడు అయితే కొన్నాళ్లకు ఆయనకు సరైన విజయం మాత్రం రావట్లేదు. ఆయన నటించిన గత రెండు సినిమాలు గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ డిజాస్టర్ గా మిగిలాయి. ఈ క్రమంలోని వరుణ్ తేజ్ మార్కెట్ భారీగా దెబ్బతింది. ఇక ఆ ప్రభావం ఆయన లేటెస్ట్ మూవీ మట్కా పై గట్టిగా చూపించింది. అలాగే అడ్వాన్స్ బుకింగ్ కూడా దారుణంగా పడిపోయాయి.
హీట్ టాక్ తెచ్చుకుంటే కానీ మట్కా సినిమాకి కలెక్షన్లు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు హీరోయిన్గా మీనాక్షి చౌదరి, అజయ్ ఘోష్ , రవిశంకర్ , నోరా పదేహి వంటి వారు కీలకపాత్రలో నటించారు. జీవి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందించారు. విజేందర్ రెడ్డి తీగల, రజని తల్లూరి ఈ సినిమాకు నిర్మించారు. ఈ మట్కా సినిమాను రతన్ ఖేత్రీ అనే గ్యాంగ్ స్టార్ జీవితం ఆధారంగా తెరకేక్కించారు. అణగారిన వర్గానికి చెందిన రతన్ ఖేత్రి మట్కా అనే ఇల్లీగల్ దందా ద్వారా గ్యాంగ్ స్టార్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. రతన్ పాత్రను మట్కా వాసుగా వరుణ్ తేజ్ నటించాడు. మట్కా సినిమాపై ఆడియన్స్ అభిప్రాయం యావరేజ్ .. మూవీ ప్యూరిటీస్ సెటప్ బాగుంది పీరియాడిక్ సెటప్ బాగుంది. సెట్స్, ఆర్ట్ వర్క్ అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి. ఈ సినిమా నిర్మాణం విలువలు విజువల్స్ మెప్పించే అంశాలు ముఖ్యంగా వరుణ్ నటన గెటప్ క్యారెక్టరైజేషన్ ఎంతో బాగుంది.జీవి ప్రకాష్ మ్యూజిక్ కొంతమేర మెప్పించింది .. ఈ సినిమాలో నటించన ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే కథలో కొత్తదనం ఏమీ లేదు.. వాస్తవ సంఘటన ఆధారంగా తెర్కక్కించిన అప్పటికీ కేజీఎఫ్ , పుష్ప వంటి ఇతర సినిమాల ప్రభావం గట్టిగా కనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే , సన్నివేశాలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదని చూసిన ప్రేక్షకులు అంటున్నారు .. ఇక హీరోయిన్గా మీనాక్షి పాత్ర సైతం పరిమితంగానే ఉంటుంది. మొదటి భాగం యావరేజ్ గా ఉంటే సినిమాలో వచ్చే రెండో భాగం సైతం అంత గొప్పగా ఏమీ లేదని అంటున్నారు. మట్కా వాసు పాత్ర మాత్రం ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోయిందని కూడా అంటున్నారు. మొత్తంగా మట్కా సినిమాకి ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వస్తుంది.