సౌత్ విలక్షణ నటుడు సూర్య నటించిన భార్య పాన్ ఇండియా మూవీ కంగువ.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా యూనిట్ భారీ స్థాయిలో ప్రమోషన్ నిర్వహించారు.. ఇక దాంతో సినిమాపై భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అయింది. కోలీవుడ్ దర్శకుడు శివ దర్శకత్వంలో.. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఈ సినిమాని జ్ఞానమేల రాజా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు .. అలాగే ఇది బాహుబలి స్థాయి సినిమా అంటూ తమిళ ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఈ సినిమాలో విజువల్స్ కూడా అదే రేంజ్ లో ఉండడంతో సూర్య గట్టి ప్రయత్నమే కంగువాతో చేశారని అంచనాలు పెరిగాయి. ఎట్టకేలుకు ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులను మప్పించిందా లేదా.. అనే విషయాలు ఇక్కడ చూద్దాం.
2గంటల 34 నిమిషాల నిడివితో కంగువా మూవీ మొదలవుతుంది.. కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని దీవుల్లో ఉండే ట్రైబల్ విలేజిల నేపథ్యంలో సినిమా కథ మొదలవుతుంది.. ఆ తర్వాత మన ప్రెసిడెంట్ డే కి వచ్చేస్తుంది.. సూర్య గోవాలో దిశాపటాని స్టైలిష్ ఎంట్రీ ఇస్తారు .. అలాగే తర్వాత వచ్చే మిస్సింగ్ కేసులో సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. తిరిగి కథ వందల సంవత్సరాల క్రితంలోకిి వెళ్ళిపోతుంది. ఇక సూర్య కంగువ గెటప్ లో పవర్ఫుల్ ఎంట్రీ ఇస్తాడు. అదిరిపోయే ఫైట్ డిఎస్పి బిజిఎం తో కొంగువా ఎంట్రీ ప్రేక్షకులకుగూస్ బంప్స్ తెప్పిస్తుంది.. కొన్ని ఉత్కంఠ సన్నివేశాలతో ఈ చిత్రం ఇంటర్వెల్ వరకు వెళుతుంది.సూర్య కంగువగా.. ఒక ఐలాండ్ కి… బాబీ డియోల్ మాలో ఐలాండ్ కి రాజులుగా ఉంటారు. బాబీ డియోల్ – సూర్య మధ్య యుద్ధం మొదలవుతుంది పర్ఫెక్ట్ ఇంటర్వెల్తో ఫస్ట్ ఆఫ్ ముగుస్తుంది. మొదటి భాగంలో కొన్ని బిగినింగ్ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పంచాయి .. 100 ఏళ్ల నాటి ఐలాండ్స్ వాటి సెట్ అప్ తో దర్శకుడు కథపై మంచి ఆసక్తిని పెంచేలా చేశాడు.. కానీ ఒక పాయింట్ నుంచి కథ ప్రేక్షకులకు అర్థం కాకుండా పోతుంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలకు మాత్రమే బాగుంది.
కంగువ పాత్రలో సూర్య ఎంతో పవర్ ఫుల్ గా మెప్పించారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఫస్ట్ ఆఫ్ కు మైనస్ కొన్ని సీన్లు ప్రేక్షకులకు విసుగు తప్పించేలా ఉన్నాయి. వందల ఏలనాటి జీవులు అక్కడ ట్రైబుల్ జాతులస్టోరీని అద్భుతంగా చూపించిన దర్శకుడు శివ అదే ఫ్లోని తర్వాత కొనసాగించలేకపోయాడు. సూర్యతో పాటు ఇతర పాత్రుల మేకప్ కష్టం కూడా ఈ సినిమాలో బాగా కనిపిస్తుంది. కానీ ఆ క్యారెక్టర్ల పేర్లు కూడా ప్రేక్షకులకు గందరగోళంగా అనిపిస్తాయి.ఇక సెకండ్ హాఫ్ లో కథ.. ప్రస్తుతం మరియు…. గతంలో జరిగే స్టోరీ కి పార్లర్ గా ఉంటుంది. రెండు కాలాలని లింక్ చేస్తూ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ని పెట్టారు. కొన్ని సన్నివేశాలలో ఉత్కంఠని తెరదించుతూ ట్విస్ట్ లని రివీల్ చేశారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కంగువ కొన్ని డీసెంట్ ఎపిసోడ్స్ లో మాత్రమే మెప్పిస్తుంది. మిగిలిన నేరేషన్ మొత్తం డిజప్పాయింట్ చేస్తుంది. సూర్య కంగువ పాత్రలో అతని కష్టం, భారీ చిత్రానికి తగ్గ డెడికేషన్ కనిపిస్తాయి.
ఎమోషనల్ గా ఈ చిత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాదు. గ్రాండియర్ కనిపిస్తుంది. డైరెక్టర్ శివ స్క్రీన్ ప్లే లో ఫస్ట్ హాఫ్ లో కొంతవరకు సక్సెస్ అయ్యారు. సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో విఫలం అయ్యారు. ఆడియన్స్ సహనానికి సెకండ్ హాఫ్ పరీక్ష అన్నట్లుగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాల్లో దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ అసలు వర్కౌట్ అవలేదు.. కొన్ని సీన్స్ లో బిజిఎం మెప్పించకపోగా ప్రేక్షకులకు చిరాకు తెప్పించే భారీ శబ్దాలు వింటున్నట్టు అనిపిస్తుంది. మొత్తంగా కంగువ సినిమా అంచనాలకు అందుకోవటంలో ప్రేక్షకులను నిరాశ పరిచిందనే చెప్పవచ్చు. విజువల్ పరంగా సినిమా బాగున్న స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా బిలో యవేరేజ్ మూవీ గా ఈ సినిమా నిలుస్తుంది. ఇక మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.. కంగూవ లాంటి భారీ సినిమా ఇలా బిలో యవరేజ్ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు .. సూర్య ప్రేక్షకులకు గట్టు షాకే ఇచ్చాడు.