తమిళ హీరోల సినిమాలు తెలుగులో ఏ రేంజ్ లో రిలీజ్ అవుతాయో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు స్టార్ హీరోల సినిమాలు ఉన్నా సరే సర్దుబాటు చేసి మరి తమిళ సినిమాకి థియేటర్లు ఇస్తారు. తెలుగు సినిమాలకు థియేటర్లు తక్కువగా ఉన్నా సరే.. తమిళ సినిమాకు ముందు థియేటర్లు ఇవ్వడం తెలుగు వాళ్లకే సాధ్యమైంది. ఇది ఎప్పటినుంచి కాదు.. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఇప్పుడు అయితే మరింత వేగంగా తమిళ సినిమాకి తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు దొరుకుతున్నాయి. కానీ.. తెలుగు హీరోలు నటించిన సినిమాలకు మాత్రం తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు దక్కాలంటే నాన్న.. అష్ట కష్టాలు పడుతున్నారు.
పైగా కోట్ల రూపాయలు పబ్లిసిటీ కూడా తమిళ సినిమాకు చాలా ఫ్రీగా దక్కుతుంది. టాలీవుడ్ దర్శక, నిర్మాతలు కోలీవుడ్ హీరోలకు నిరాజనాలు పలుకుతున్నారు. తమిళ హీరోలను పోటీపడి మరి తెలుగులో పరిచయం చేస్తున్నారు. విజయ్ లాంటి హీరోలైతే వారసుడు సినిమాతో తెలుగులో పరిచయమైన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజైన తమిళ డబ్బింగ్ సినిమా అమరాన్ కు తెలుగులో పెద్ద ఎత్తున థియేటర్లు దొరికాయి. ఈ సినిమాతో పాటే తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన క సినిమాకు తమిళనాడులో థియేటర్లు అడిగితే.. మేము థియేటర్లు ఇవ్వం అని వాళ్ళు తేల్చి చెప్పారు.
కనీసం 10 థియేటర్లు అయినా ఇస్తే బాగుంటుందని హీరో ఎంతో ఆశించాడు. కానీ.. ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు. ఇలా తెలుగు సినిమాకి తమిళనాడు చాలా ఏళ్ళుగా అన్యాయం జరుగుతోంది. పాన్ ఇండియా సినిమా బాహుబలి సినిమాకే తమిళనాట ఎక్కువ థియేటర్లు దొరకలేదు. అయితే తమిళ హీరోలు నటించిన అన్ని సినిమాలకు తెలుగులో భారీ ఎత్తున థియేటర్లు దొరుకుతూ ఉంటాయి. తెలుగు సినిమాకి తమిళనాడులో ఎందుకు ధియేటర్లు ఇవ్వరు అని టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు ఏనాడు కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. ఇక్కడ ఎవరి స్వార్థం వారిది. ఎవరు వ్యాపారం వారిది అన్నట్టుగా ఉంది.