Moviesస్టేజ్‌పైనే దేవిశ్రీ రుస‌రుస‌లు... ఆ క్రెడిట్ మైత్రీ వాళ్లు స్క్రీన్ మీద...

స్టేజ్‌పైనే దేవిశ్రీ రుస‌రుస‌లు… ఆ క్రెడిట్ మైత్రీ వాళ్లు స్క్రీన్ మీద ఇవ్వ‌ట్లేదా..?

పుష్ప 2 విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కి.. నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీస్ కి మధ్య ఏవో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఇద్దరికీ మధ్య ఎక్కడ గొడవ ముదిరిందో తెలియదు కానీ.. దేవి శ్రీ ప్రసాద్ అనుకున్న టైం కు పాటలు ఇవ్వలేదని, నేపథ్య సంగీతం ఇవ్వలేదని మైత్రి వాళ్ళు బాగా కోపంతో ఉన్నారు. అందుకే నేపథ్య సంగీతం కోసం మైత్రి వాళ్ళు మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకువచ్చారు. ఇందులో థ‌మన్‌ కూడా ఉన్నాడు. సినిమాను ముక్కలు.. ముక్కలుగా.. చేసి ఒక్కో పార్ట్ ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్‌తో.. ఆర్ఆర్ ఇప్పించుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మరో ముగ్గురు సంగీత దర్శకులని మైత్రి మూవీస్ రంగంలోకి దింపినప్పుడే అర్థమైంది.Pushpa 2 : పుష్ప-2 ట్రైలర్ ఎప్పుడంటే | Pushpa 2 Trailer Release Date: Fans  Await Mid-November Updateఅయితే సుకుమార్.. దేవిశ్రీప్రసాద్‌ల‌ది విడదయలేని అనుబంధం. దేవి లేకపోతే.. సుకుమార్ సినిమా చేయలేను అని చాలాసార్లు చెప్పాడు. పుష్ప విజయంలో దేవిశ్రీప్రసాద్ కీలక పాత్ర అలాంటిది. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం దేవిని పక్కనపెట్టి థ‌మన్, అజనీష్ లోక్‌నాథ్, శ్యామ్‌ ను రంగంలోకి దింపింది మైత్రి మూవీస్. దేవిశ్రీప్రసాద్ సమయానికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని.. అందువల్ల మరో ముగ్గురిని తీసుకోవాల్సి వచ్చిందని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

అయితే తాను చేయాల్సిన పని మరొకరు చేయడం దేవిశ్రీప్రసాద్ కు ఎంత మాత్రం ఇష్టం లేదు. అసలే గొడవలు జరుగుతూ ఉంటే.. దేవిశ్రీ ఈ ఫంక్షన్‌కు కాస్త లేటుగా వచ్చాడు. ఈ విషయాన్ని మైత్రి మూవీస్ నిర్మాతల్లో ఒకరైన నవీన్.. దేవిని అడిగేసారట. వెంటనే దేవి కాస్త ఫీల్ అయినట్టు కనిపించింది. మనోడు తన అసహనాన్ని నవ్వుతూ బయటపెట్టేసాడు. పాటలు లేటని.. బ్యాగ్రౌండ్ స్కోర్ లేటని.. తనని అంటూనే ఉంటారని.. ఇప్పుడు కూడా ఫంక్షన్ కి లేటుగా వచ్చానని ఫీలయ్యారని.. ఈ విషయంలో తన‌ని ఏం చేయమంటారు అని నవ్వుతూ చురకలు అంటించాడు.Devi Sri Prasad on conflict with Salman Khan | Devi Sri Prasad: స్టార్  హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!అలాగే.. ఎవరి క్రెడిట్ ఎవరైన తీసుకోవాల్సిందే అని.. అది పేమెంట్ అయినా, స్క్రీన్ మీద క్రెడిట్ అయినా తప్పదని కామెంట్ చేశాడు. అంటే బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో క్రెడిట్ తనతో పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులకు పంచటం దేవికి ఇష్టం లేదని.. అందుకే ఇలాంటి కామెంట్లు చేశాడన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మైత్రి, ప్రసాద్‌కు గతంలో ఉన్నంత అనుబంధం ఇప్పుడు లేదు అన్నది వారి మాటల ద్వారానే తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news