గత సంవత్సరం ఆస్కార్ వేడుకల్లో భారతీయ సినిమా నుంచి త్రిబుల్ ఆర్ పోటీలో నిలిచి ఆస్కార్ అవార్డును గెలుచుకుంది .. ఇప్పుడు 2025లో జరిగే ఆస్కార్ వేడుకల్లో మన భారతీయ సినిమా నుంచి లాపతా లేడీస్ సినిమా బరిలో దిగింది .. ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో పోటీ పడుతుంది. ఈసారి ఎలాగైనా ఆస్కార్ అవార్డును సాధించాలన్న కసితో తన ప్రమోషన్ల విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నాడు. త్రిబుల్ ఆర్ తో ఇండియన్ సినిమాకు తొలి ఆస్కార్‌ను సాధించాడు రాజమౌళి..ఆస్కార్ అవార్డు వచ్చింది త్రిబుల్ ఆర్ లో పాటకే అయినా.. అసలు అక్కడి దాకా సినిమాను తీసుకెళ్లడంలో రాజమౌళి ప్లానింగ్ ముఖ్యపాత్ర పోషించింది. భవిష్యత్తులో ఇండియన్ సినిమాఆస్కార్ బరిలో నిలవాలంటే ఏం చేయాలన్న గైడ్లైన్స్ సెట్ చేసింది. అలా తన సినిమా కోసం జక్కన్న వేసిన రూట్లో నడుస్తున్నారు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్.. 2025 మార్చిలో జరగబోయే ఈవెంట్ కోసం ఇప్పటికే ప్రిపరేషన్ మొదలు పెట్టారు.. తొలి ప్రయత్నం గా ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు చేరవ చేసేందుకు లాపతా లేడీస్ టైటిల్‌ను లాస్ట్ లేడీస్ అని మార్చారు.గత సంవత్సరం ఆస్కార్ అవార్డ్ టైంలో త్రిబుల్ ఆర్ టీం హాలీవుడ్ మీడియాకు రెగ్యులర్గా ఇంటర్వ్యూ ఇస్తూ వచ్చింది. వీలైనంత ఎక్కువగా ఆస్కార్ జ్యూరీ దృష్టిలో పడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఆమిర్ కూడా అదే స్టైల్ ను ఫాలో అవబోతున్నాడు. ఆల్రెడీ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటం స్టార్ట్ చేసింది ఆమిర్ టీమ్. ఈ నాలుగు నెలల పాటు పూర్తి స్థాయిలో సినిమాను ప్రమోట్ చేసిన ఎలాగైన ఆస్కార్ సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఆమిర్. మరి ఆమిర్ అయినా ఇండియన్ సినిమాకు ఆస్కార్ సాధించి పెడతారేమో చూడాలి.
Moviesరాజమౌళి రూట్లో బాలీవుడ్.. ఆస్కార్ కోసం సౌత్ మీద కన్నేశారుగా..!
రాజమౌళి రూట్లో బాలీవుడ్.. ఆస్కార్ కోసం సౌత్ మీద కన్నేశారుగా..!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి
- Tags
- america
- Bollywood
- enjoying news
- entertaining news
- entertainment news
- exciting news
- filmy updates
- genuine news
- intresting news
- intresting updates
- journalist excluisve
- Lapata ladies movie
- Latest News
- latest trending news
- oscar award
- rajamouli
- social media
- star hero
- star heroine
- super news
- Tollywood
- tollywood filmy updated news
- very useful news
- viral news