Moviesఎన్టీఆర్ ' దేవ‌ర‌ ' పై టాలీవుడ్‌కు ఎందుకింత అక్క‌సు... ఏంటీ...

ఎన్టీఆర్ ‘ దేవ‌ర‌ ‘ పై టాలీవుడ్‌కు ఎందుకింత అక్క‌సు… ఏంటీ ద్వేషం…?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా భారీ అంచనాల మధ్య గత నెల 27న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు రూ.120 కోట్లకు అమ్మేవారు. జీఎస్టీతో కలుపుకుని దాదాపు సినిమా కొన్నవారు అందరూ సేఫ్ జోన్ లోకి వచ్చేసారు. దసరా సెలవులలో వచ్చే మొత్తం అంతా లాభాలే అని చెప్పుకోవాలి. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇదంతా కేవలం ఎన్టీఆర్ ఒంటి చేత్తో తెచ్చిన కలెక్షన్లు మాత్రమే. ఈ విషయంలో దర్శ‌కుడు కొరటాల శివ పూర్తిగా విఫలం చెందారు.

Devara: Part 1 - Wikipedia
కొరటాల మానియా ఈ సినిమాకు ఎంత మాత్రం పనిచేయలేదు. కేవలం ఎన్టీఆర్ తన నటనతో ఒక వీక్ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసి పడేశారు. ఆంధ్రాలో పెంచుకున్న రేట్లు.. అదనపు షోలు.. ఇవన్నీ కలిసి ఈ సినిమాను కొంతవరకు ఒడ్డున పడేసాయి. ఈ విషయంలో త్రివిక్రమ్ , పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అక్కడ వరకు బాగానే ఉంది. ఇటీవల కాలంలో ఏదైనా చిన్న సినిమా కాస్త హిట్ అయితే చాలు.. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ సోషల్ మీడియా ఖాతాలలో కామెంట్లు పెట్టేస్తున్నారు. హాయ్, కమిటీ కుర్రాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలకు పెద్దపెద్ద హీరోలు ట్విట్లు వేసి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు.

Devara X review Fans 'blown away' by Jr NTR's performance, but disappointed  by VFX - India Today
అయితే ఎన్టీఆర్ దేవర సినిమా గురించి ఏ హీరో కూడా ఒక్క కామెంట్ కూడా పెట్టలేదు. బన్నీ లాంటివాళ్ళు అయితే ఏదైనా సినిమా హిట్ అయితే ఆ సినిమా యూనిట్ మొత్తానికి గ్రాండ్ పార్టీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ దేవర విషయంలో ఏ ఒక్క స్టార్ హీరో ఎందుకు స్పందించలేదు. ఎందుకు సోషల్ మీడియా ఖాతాలలో అభినందనలు తెలియజేస్తూ పోస్టులు పెట్టడం లేదు. దేవరపై ఎందుకింత వివక్ష అన్నది తెలియటం లేదు. అప్పుడే దేవర రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో పాటు.. రెండో వారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మరి ఇప్పుడు అయినా టాలీవుడ్ స్టార్ హీరోలు దేవరపై స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news