దివంగతి అతిలోక అందాల సుందరి శ్రీదేవి గురించి భారతియ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 55 సంవత్సరాల వయసులోనే దుబాయ్‌లో ఫంక్షన్‌కి వెళ్ళిన శ్రీదేవి అక్కడే బాత్రూం టబ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. శ్రీదేవి వాస్తవంగా తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. అయినా ఆమె కుటుంబం మూలాలు అన్ని ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలోనే ఉన్నాయి.
శ్రీదేవి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అయినా.. ఆమెకు తిరుగులేని స్టార్టింగ్ కట్టబెట్టింది మాత్రం తెలుగు సినీ ప్రేమికులు. ఆ తర్వాత తమిళంలోనూ ఆమె తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ మకుటం లేని మహారాణిలా వెలిగిపోయింది. హిందీ సినీ ప్రేమికులు శ్రీదేవిని అతిలోకసుందరిగా ఆరాధించారు. ఈ క్రమంలోనే ఆమె కెరీర్ పరంగా కొన్ని తప్పులు చేసింది. అప్పటికే పెళ్ళయి పిల్లలు ఉన్న బోనికపూర్ మాయలోపడిన శ్రీదేవి.. అతడి జీవితంలోకి రెండో భార్యగా వెళ్ళింది.
ఆ తర్వాత శ్రీదేవిని తన ఆర్థిక అవసరాలకు బాగా వాడుకున్న బోణికపూర్కు స్వార్థం బాగా పెరిగిపోయింది. తన కొడుకు అర్జున్ కపూర్ సినిమాలకు శ్రీదేవి దగ్గర డబ్బులు తీసుకుని పెట్టుబడులు పెట్టించడం.. ఆమెను ఆర్థికంగా దివాలాతీసే వరకు వాడుకోవడం.. చకచకా జరిగిపోయాయి. జాన్వీ కపూర్ కడుపులో ఉండగా బోనీ మొదటి భార్య అయితే.. శ్రీదేవిని కడుపులో బలంగా తన్నడంతో ఆ బాధతో శ్రీదేవి విలవిలలాడిపోయిందన్న ప్రచారం కూడా ఉంది. ఇదే విషయాన్ని శ్రీదేవి.. బోనికి చెప్పుకుని బాధపడ్డా ఏనాడు అస్సలు పట్టించుకోలేదట.
ఆ తర్వాత అర్జున్ కపూర్ అయితే.. శ్రీదేవుని జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకుంటూ వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. శ్రీదేవి తన కెరీర్ చివరి దశలో ఎన్నో బాధలు పడింది. అప్పటికి గాని ఆమెకు తాను బోణి కపూర్‌ను పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశాను అన్న విషయం తెలిసి రాలేదు. అప్పటికే ఆమెకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శ్రీదేవి ఆర్థికంగా కూడా కొంతవరకు దెబ్బతింది. అలా శ్రీదేవి తన కెరీర్లో చేసిన పెద్ద తప్పు ఏంటంటే.. బోనికపూర్ మాయలో పడటం. అదే ఆమె కెరీర్‌ను అర్ధాంతరంగా ముగిసేలా చేసింది.