Moviesఅది కావాలి.. ఇది కావాలి.. హీరోగా విలన్ గా.. బాక్సాఫీస్ ను...

అది కావాలి.. ఇది కావాలి.. హీరోగా విలన్ గా.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్టార్ట్స్ వీరే..!

ఇక చిత్ర పరిశ్రమలో హీరోలు గాను విలన్ గాను ఏ పాత్ర ఇచ్చిన దానికి ప్రాధాన్యం ఉంటే చాలు విలన్స్ గాను నటించి మెప్పిస్తున్నారు కొందరు హీరోలు. అలా చాలామంది హీరోలు విలన్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించడం మనం చూస్తున్నాం. ఇలా ఈ లిస్టులో కిచ్చా సుదీప్, సూర్య చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇలా ఎవరెవ‌రు ఈ లిస్టులో ఉన్నారో చూద్దాం.

Suriya 43: ఇక రచ్చే.. హీరో సూర్య నయా మూవీ అప్డేట్.. సినిమాలో ఆ స్టార్ హీరో  కూడా.. ! - Telugu News | Hero surya 43 movie update movie team officially  released | TV9 Telugu

ముందుగా కిచ్చా సుదీప్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. 2012లో వచ్చిన ఈగ సినిమాలో నాని, సమంత, సుదీప్ నటించ‌రు. అప్పటివరకు సుదీప్ హీరోగా మాత్రమే అందరికీ తెలుసు.. ఈగలో విలన్ గా తన నటనతో అందరినీ మెప్పించాడు.

ఆ తర్వాత మరో స్టార్‌ హీరో సూర్య కూడా విలన్ పాత్రకి కిక్ ఇచ్చిన నటుడనే చెప్పాలి. కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్‌ క్లైమాక్స్లో కొన్ని నిమిషాలు మాత్రమే సూర్య కనిపిస్తాడు అయితే విలన్‌గా అందరి దృష్టిని ఆకర్షించాడు. విక్రమ్ సిక్వల్ లోను విలన్ గా నటించి హైలెట్ అవునన్నాడని టాక్ కూడా వినిపిస్తుంది.

Kiccha Sudeep | ఎన్నికల వేళ ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న కన్నడ నటుడు  సుదీప్‌-Namasthe Telangana

మరో స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ పాత్ర ‘పుష్ప’ సినిమాకి హైలైట్. మొత్తానికి అతనే విలన్. పోలీస్ గెటప్ లో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసి మెప్పించారు ఫహద్. దీంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. ‘పుష్ప 2’ డిసెంబర్‌లో విడుదల కానుంది. ఈ లోనూ విలన్‌గా అదరగొట్టనున్నాడు ఫహద్.

Vijay Sethupathi: 'పుష్ప 2'ని తిరస్కరించారా?: విజయ్‌ సేతుపతి సమాధానమేంటంటే  | vijay-sethupathi-about-pushpa-2

ఇక హీరోగా విజయ్ సేతుపతి ఎన్నో సూపర్ హిట్ ల్లో నటించారు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు విలన్ గా చేస్తున్నారువిజయ్ సేతుపతి. తెలుగులో ఉప్పెన లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు విజయ్. అలాగే దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’లో భవాని అనే విలన్‌గా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ లో ఆయన పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఇలా మరికొంతమంది విలన్ పాత్రలు చేసిన హీరోలు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news