ఒకప్పుడు వెంకీ – ఢీ – దూకుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు శ్రీనువైట్ల సూపర్ హిట్ కొట్టి చాలా రోజులైంది. వరుస డిజాస్టర్ తో ఉన్న శ్రీనువైట్ల తాజాగా వరుస ప్లాపులతో ఉన్న హీరో గోపీచంద్ కలిసి చేసిన సినిమా విశ్వం. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురి కాంబినేషన్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం చేసిన ప్రయత్నం విశ్వం. ఇప్పటికే ప్రీమియర్ షో లు కంప్లీట్ చేసుకున్నా ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. శ్రీనువైట్లకు ముందు నుంచి కామెడీలో మంచి పట్టు ఉంది. ఈ సినిమాలో యాక్షన్స్ సన్నివేశాలు దర్శకుడు బోయపాటి – బాలయ్య సినిమాలలో ఏ రేంజ్ లో ఉంటాయో ఆ రేంజ్ లో తీసినట్టు సినిమా చూసిన జనాలు చెబుతున్నారు.
విశ్వం సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ చూశాక బోయపాటి శ్రీనును శ్రీనువైట్ల గుర్తు చేశారని చెబుతున్నారు.. కామెడీ సన్నివేశాలను తీయటంలో శ్రీను వైట్లకు సెపరేట్ స్టైల్ ఉంది.. కానీ ప్రతి సినిమాలోను ఒకే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారన్న విమర్శలు కూడా ఇప్పటివరకు ఎదుర్కొన్నారు. అయితే విశ్వం సినిమాలో శ్రీను వైట్ల రొటీన్ ఫార్ములా పక్కన పెడితే ఫస్టాఫ్ చాలా బాగుందని.. కామెడీ చాలా బాగా వర్క్ అవుట్ అయిందని చెప్తున్నారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ చాలా బాగా వర్క్ అవుట్ అయిందట. సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ గురించి గతంలో శ్రీనువైట్ల సినిమాలో కామెడీ ఎలా ఉందో అలా వర్క్ అవుట్ అయిందని అంటున్నారు.
శ్రీనువైట్ల కూడా ఈ సినిమాలో ట్రైన్ సీన్ బాగా వర్కౌట్ అవుతుంది అని చెబుతూ వస్తున్నారు. వెంకీ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ తరహాలో హిట్ అవుతుందని ఆడియన్స్ కూడా నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకాన్ని శ్రీనువైట్ల నిజం చేసినట్టు ప్రీమియర్ షో ట్రాక్ ద్వారా తెలుస్తోంది. వెన్నెల కిషోర్ కూడా అదరగొట్టారు.. సినిమా ప్రీమియర్ రిపోర్ట్స్ బాగున్నాయి.. సినిమాకు హిట్ టాక్ వినబడుతుంది. అయితే క్లైమాక్స్ పోర్షన్ 30 మినిట్స్ సరిగా తీసి ఉంటే సినిమా ఇంకా అదిరిపోయేదంటున్నారు. ఏదేమైనా శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అంటున్నారు. మరి ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి…