మెగా హీరో… టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మట్కా. ఈ సినిమా టీజర్ ఈ రోజు లాంచ్ చేశారు. మట్కా సినిమాకు పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు. ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమాలో కథకు అనుగుణంగా నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో వరుణ్ తేజ్ కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం 1980 బ్యాక్ గ్రౌండ్ లో వైజాగ్ లొకేషన్స్ రీ క్రియేట్ చేశారు.
ఇటీవల ఆ సెట్స్‌లో వరుణ్ ఫోటోలు లీక్ అయ్యాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 14న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ యేడాది ఆపరేషన్ వాలంటైన్, గాంఢీవధారి అర్జున సినిమాలు డిజాస్టర్ కావడంతో వరుణ్తో పాటు మెగాభిమానులు మట్కా సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక టీజర్‌లో వరుణ్ తేజ్ గెటప్స్‌తో పాటు ఆ లుక్స్, ఆ విజువల్స్ అప్పట్లో విశాఖ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాయి.
ఈ టీజర్‌ను విజయవాడలోని యువరాజ్ సెంటర్ లో ఉన్న జీ3 థియేటర్లో లాంచ్ చేశారు. ఇక చెప్పినట్టుగానే వరుణ్ ఈ రోజు మధ్యాహ్నమే ఈ ఈవెంట్ కోసం విజయవాడ చేరుకున్నారు. వరుణ్ ను సరికొత్త అవతారంలో చూపించడం… సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. టీజర్‌లో నెవర్ బిఫోర్ వరుణ్ లుక్స్, అదిరిపోయే డైలాగులు, దుమ్మురేపే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి. టీజర్ చూస్తుంటే మెగాఫ్యాన్స్‌కు పూనకాల లోడింగ్ అవుతున్నట్టుగా ఉంది. మరి ఈ సినిమాతో అయినా వరుణ్ హిట్ కొట్టి ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి.